హైదరాబాద్

రైల్వే సిబ్బంది అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్ 22: భద్రత సమయపాలనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జిఎం రవీంద్రగుప్త బుధవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రెండు చిన్న పుస్తకాలను సైతం ఆయన విడుదల చేశారు. లోకో పైలెట్‌లకు, గార్డులకు, స్టేషన్‌మాస్టర్‌లకు విపత్కర సమయంలో పనికి వచ్చేవిధంగా ఈ పుస్తకాలను రూపొందించారు. వీటిని రూపొందించిన హెడ్‌క్వార్టర్స్ భద్రతా సిబ్బందిని ఆయన అభినందించారు.
వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా అన్ని విభాగాల ప్రధానాధిపతులు. చిన్న చిన్న సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా భద్రతాపరమైన గట్టి చర్యలు చేపట్టాలని ఆయన డిఆర్‌ఎంలను ఆదేశించారు.
రైల్వేలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చాకచక్యంగా సకాలంలో నివారించడానికి తోడ్పడిన సిబ్బందికి ‘మ్యాన్ ఆఫ్ ద మంత్’ అవార్డులను జిఎం అందజేశారు. ఇందులో నాందేడ్ డివిజన్‌కు చెందిన అదిలాబాద్ లోకోపైలెట్ ఎం.శ్రీనివాస్‌రావు, గుంటూరు డివిజన్‌కు చెందిన నంద్యాల లోకోపైలెట్ ఎంఎండి.గౌస్ గుంతకల్ డివిజన్‌కు చెందిన రేణిగుంట లోకోపైలెట్ టి.శ్రీ్ధర్, గుంతకల్ డివిజన్‌కు చెందిన గేట్‌మెన్ బి.యేసుదాసులు ఉన్నారు.
కాగా సమయపాలన, రైళ్లవేగంపై దృష్టిసారించాలని జిఎం డిఆర్‌ఎంలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాలుపంచుకున్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి

సికింద్రాబాద్, జూన్ 22: గ్రేటర్ పరిధిలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలోప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్దయెత్తున మోహరించిన పోలీసులు దాదాపు 75మంది విద్యార్థులను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా చిలుక మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని తెరాస ప్రభుత్వం అరికట్టలేక పోయిందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతనలను అడ్డుపెట్టుకుని సిబిఎస్‌ఇ, ఐసియస్‌ఇ, అంతర్జాతీయ బ్రాండ్‌ల పేరుతో మభ్యపెడుతూ అధికారుల అండతో ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోయలేని ఫీజుల భారాన్ని మోపడంతోపాటు పాఠశాల ఆవరణలోనే యూనిఫారాలు, పుస్తకాలు కొనుగోలు చేయాలన్న నిబంధనలను విధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డగోలు వసూళ్లు చేస్తూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. అనుతులు లేకుండా అధికారులను అడ్డుపెట్టుకుని చేస్తున్న ఈ దురాగతాలను తాము గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయామని చిలుక వివరించారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం కానరావడం లేదని అందుకే అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేశామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.