హైదరాబాద్

‘లైవ్ ఎవిడెన్స్’తో ఆసరా పెన్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: పండుటాకు వయస్సులో నా అన్నవారు పట్టించుకోక పోయినా, నెలకు రూ. వెయ్యి పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం ‘ఆసరా’గా నిలుస్తోంది. కానీ ఈ ఆసరా పెన్షన్ల చెల్లింపుల్లో, లబ్దిదారుల ఎంపికల్లో తరుచూ పలు అక్రమాలు చోటుచేసుకోవటంతో వీటికి చెక్ పెట్టేందుకు అధికారులు కొత్త కొత్త విధానాలను అవలంభిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ఈ సారి జిల్లా రెవెన్యూ అధికారులు కొత్తగా ‘లైవ్ ఎవిడెన్స్’ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆసరా పథకం ద్వారా లబ్దిపొందుతున్న పెన్షన్‌దారులు వేలిముద్రలు, ఐరిష్ వివరాలు ఇవ్వటంతో పాటు తమ ‘లైవ్ ఎవిడెన్స్’ను ఏదైనా సమీపంలోని మీసేవా కేంద్రాల్లో తప్పకుండా నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లబ్దిదారులు పెన్షన్ ఐడి నెంబర్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌లతో ఈ వచ్చే నెల 20వ తేదీలోపు సమీపంలోని మీ సేవా కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుందని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. జిల్లా మండల కార్యాలయాల నుంచి లబ్దిపొందుతున్న ఆసరా లబ్దిదారులు పెన్షన్ కోసం తమ బ్యాంకు ఖాతా వివరాలను మండల కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.