హైదరాబాద్

పండుగలోపు పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు కోట్లాది రూపాయలు కేటాయించామని, అన్ని దేవాలయాల వద్ద కమిటీ ప్రతినిధులు పనులు చేయించుకోవాలని ప్రభుత్వం ప్రతి ఏటా చెప్పినా, తీరా బోనాల పండుగ రోజు కూడా పనులు చేపట్టడం జిహెచ్‌ఎంసి అధికారులకు పరిపాటైపోయిందని కొందరు కార్పొరేటర్లు వ్యాఖ్యానించారు. కనీసం ఈ సారైనా బోనాల పండుగకు ముందే దేవాలయాల వద్ధ ఏర్పాట్ల పనులు పూర్తి చేయాలని కోరారు. బోనాల ఏర్పాట్లపై రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ కార్పొరేటర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను నగరంలోని అన్ని దేవాలయాల వద్ద రోడ్లకు మరమ్మతులు, ఫుట్‌పాత్ పనులు తదితరు పనులకు గాను రూ. 14.27 కోట్లతో దాదాపు 443 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. బోనాల జాతరలో భాగంగా ముఖ్యంగా సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయానికి రంగులు వేయటంతో పాటు భక్తుల సౌకర్యార్థం బ్యారికేడ్లు, విద్యుత్ దీపాలంకరణ వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. బోనాలు జరిగే ప్రతి దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగర పోలీసులు, జిహెచ్‌ఎంసితో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు చక్కటి సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున ప్రతి దేవాలయం వద్ద పకడ్బందీగా శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. అంతేగాక, ఏ దేవాలయం వద్ధ కూడా వర్షపు నీరు నిలవకుండా డ్రెయిన్లకు మరమ్మతులు చేయటం జరిగిందని మంత్రి నాయిని వివరించారు. ఎక్కడైనా డ్రెయిన్లు పొంగటం, ఇతర సమస్యలు ఏర్పడితే వెంటనే స్పందించేందుకు గాను ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండేలా ఎమర్జెన్సీ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు కేటాయించిన నిధులు, ఖరారు చేసిన పనులే గాక, ఏ దేవాలయం వద్ధ ఎలాంటి పనులు అవసరమైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు.