హైదరాబాద్

కంటోనె్మంట్‌లో డిగ్రీ కాలేజీ: డిప్యూటీ సిఎం అలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/అల్వాల్, జూన్ 30: సికిందరాబాద్ కంటోనె్మంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ వెల్లడించారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 3వ దశలో ఏర్పాటవుతున్న మూడు మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలను జిల్లా వ్యాప్తంగా గురువారం డిప్యూటీ సిఎం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంరభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం రంగంలో విద్యాభివృద్దికి అవసరమైన కార్యక్రమాలు శరవేగంగా చేపడుతున్నామని అన్నారు. కంటోనె్మంట్ ప్రజాప్రతినిధుల కోరికను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి డిగ్రీ కాలేజీ ఏర్పాట్లు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిరు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని ఇందుకు ముఖ్యంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మహమూద్ అలీ వెల్లడించారు. ఇందులో భాగంగానే ముస్లింలకు రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేయటంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కూడా మరిన్ని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముస్లిం మైనార్టీల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. కేవలం పాఠశాల విద్యయే గాక, విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వీలుగా ముస్లిం విద్యార్థులకు రూ. 10లక్షల నాన్ రిఫండబుల్ రుణ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి కల్పించారని, దీన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద వాళ్లలో కూడా కష్టపడి చదవి ఉన్నత పదవులు అలంకరించిన బ్దుల్ కలాం లాంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
పాతబస్తీ అభివృద్ధికై ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలు చేపడుతున్నారని, అందులో భాగంగా త్వరలోనే ఐటి పార్కు, బాలికలకు కెజి నుంచి పదవ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్ ఏ ర్పాటు వంటి పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జి. సాయన్నతో పాటు పలువురు విద్యాశాఖాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సిఎం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.