హైదరాబాద్

కొత్త జిల్లాలపై మంత్రుల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల్లో భాగంగా హైదరాబాద్, సికిందరాబాద్ జిల్లాల ఏర్పాటు విషయమై రాష్ట్ర పశుసంవర్థక శాక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావులు రెవెన్యూ అధికారులతో గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రతిపాదన స్థాయిలో ఉన్న హైదరాబాద్, సికిందరాబాద్ జిల్లాల ఏర్పాటుపై వారు అధికారులతో చర్చించారు. ఏ జిల్లాలోకి ఏ ఏ మండలాలు రావాలి, అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? అన్న అంశంపై హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి, ఆర్డీవో రఘురాం శర్మతో ప్రత్యేకంగా చర్చించారు. ముఖ్యంగా పరిపాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఒక జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుండాలి? అన్న విషయంపై మంత్రులు సంప్రదింపులు జరిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వచ్చిన ఇబ్బంది లేదనే ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న హైదరాబాద్, సికిందరాబాద్ జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కేవలం ప్రాథమికమైనందున, మరింత సమగ్ర సమాచారంతో మరో సారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు.
రెండు జిల్లాలు..మూడు ముక్కలు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మున్ముందు మూడు జిల్లాలుగా ఏర్పడే అవకాశాలున్నట్లు ప్రాథమికంగా సమాచారం. హైదరాబాద్ సిటీ కోర్ సిటీతో ప్రాంతంతో హైదరాబాద్ జిల్లా, అలాగే సికిందరాబాద్ సిటీ ప్రాంతం, కంటోనె్మంట్ ఏరియాతో పాటు మరికొన్ని శివార్లను కలుపుకుని సికిందరాబాద్ జిల్లాను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇక రంగారెడ్డి జిల్లా ప్రస్తావనకొస్తే రంగారెడ్డి జిల్లా కనుమరుగై వికారాబాద్ హెడ్‌క్వార్టర్‌గా వికారాబాద్ జిల్లా ఏర్పడే అవకాశామున్నట్లు సమాచారం. దీనిపై వచ్చే దసరా పండుగ కల్లా మరింత కసరత్తు జరిగి, తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.