హైదరాబాద్

‘వైద్య శిరోమణి’ అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ప్రపంచ వైద్యుల దినోత్సవ సంబరాలలో భాగంగా గురువారం సాయంత్రం రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఎంపిక చేసిన వైద్యులకు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిరోమణి - 2016 అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ వైద్యులను శాలువాతో సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు. ప్రొ. డా. ఆర్.గోపినాథ్ (నిమ్స్), డా. వి.ముఖేష్‌రావు (యశోద హాస్పిటల్), డా. రాజీవ్. వి. మీనన్ (కేర్ హాస్పిటల్), ప్రొ. లంకా కృష్ణ (నిమ్స్), ప్రొ. విజయకుమార్ మల్లాది (ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్), డా. నిహార్ రాజన్ ప్రదాన్ (అపోలో హాస్పిటల్), డా. ఎ.ఎం.వి.ఆర్. నరేంద్ర (నిమ్స్), డా. ఆనంద్ అగర్వాల్ (విరించి హాస్పిటల్), డా. ఎం.వి.యస్. సుబ్బలక్ష్మి (నిమ్స్), డా. పి.నర్సింగరావు (సన్‌షైన్ హాస్పిటల్), డా. ఎన్.ఆనంద్ (సెంచరి హాస్పిటల్), డా. గీతా నాగశ్రీ (కిమ్స్ హాస్పిటల్), డా. ఎస్.మాణిక్ ప్రభు (తుంబె హాస్పిటల్), డా. అంబాదాస్ కథార్ (ఉదయ్ బిమిని హాస్పిటల్), డా. ఎస్.శ్రీకాంత్ (గ్లోబల్ హాస్పిటల్), డా. ఎ.చౌహాన్ (ఎతన్స్ హాస్పిటల్), డా. జి.అంజమ్మ (ప్రభుత్వ హోమియో డిస్పెన్సరి)లకు అవార్డులను ప్రదానం చేశారు.
ప్రముఖ వైద్య నిపుణులు డా. కాకర్ల సుబ్బారావు అధ్యక్షత వహించగా ప్రొ. డి.కె.రెడ్డి, ఎర్ర లత్సన్న, ఎన్.విజయభాస్కర్ రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు అంకెనాపల్లి మల్లికార్జునరావు స్వాగతం పలికారు.