హైదరాబాద్

తక్షణమే ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: పేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చెల్లించి, వైద్యం అందని పేదలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను
చెల్లించలేదంటూ పలు ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత అనీల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నేతలు ప్లకార్డులతో శనివారం మధ్యాహ్నం కోఠిలోని డిఎంఇ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించటంతో ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయమేర్పడింది. ఈధర్నానుద్దేశించి అనీల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా పుష్కర స్నానాల కోసం ప్రభుత్వం రూ. 600 కోట్లు వెచ్చించటం బాగానే ఉందని, అందులో కనీసం సగమైన రూ. 300 కోట్లను పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లుల కోసం చెల్లిస్తే ఎన్నో వేల మందికి కార్పొరేట్ వైద్యం అందే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించిన నేడు తెలంగాణ ప్రభుత్వం వ్యవహారిస్తోందని, ఇందుకు తగిన మ్యూలం చెల్లించుకోక తప్పదని అనీల్‌కుమార్ వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పటికపుడు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపుతూ కాలం గడుపుతుందే తప్పా, సామాన్య ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆరోగ్య శ్రీపైనే ఆధారపడి ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన రోగులకు సకాలంలో వైద్యం అందక నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారన్న విషయాన్ని ఇప్పటికైన ప్రభుత్వం గుర్తించి వెంటనే బిల్లులను మంజూరు చేయాలని, లేని పక్షంలో బిల్లులు మంజూరు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్, ఎన్‌ఎస్‌యు అధ్యక్షుడు రోహిత్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి సాయి, గోషామహల్ ఇన్‌ఛార్జి సూర్య, అంబర్‌పేట నియోజకవర్గం జాబేర్‌తో అధిక సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.