హైదరాబాద్

ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నార్సింగి, జూలై 6: సర్కారు వైద్యమంటేనే సామాన్యులకు వెన్నులో వణుకుపుడుతోంది. ఓ పెద్దాసుపత్రిలో బతికున్న చిన్నారిని చనిపోయాడంటూ చెత్తబుట్టలో పారేస్తారు..మరో సర్కారు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య రోగులుంటే, వైద్యులు, సిబ్బంది జోక్‌లు వేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు..ఇక అన్నీ సక్రమంగా ఉన్న మరికొన్ని ఆసుపత్రుల్లో వైద్యులే అందుబాటులో ఉండరు. ఇవీ ఇప్పటి వరకు నగరంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అక్కడి వైద్యుల నిర్లక్ష్య వైఖరిని బయటపెట్టిన సంఘటనలు. కానీ శరీరంలోనే అతి సున్నితమైన, ప్రపంచం చూసేందుకు ఎంతో ముఖ్యమైన కంటికి ఆసుపత్రి చేసే సమయంలో కనీస జాగ్రత్త పాటించకుండా సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు వ్యవహరించిన తీరు 13మందికి చూపును కొల్పోయే పరిస్థితులకు కారణమైంది. గతనెల 30న ఇరవై మంది రోగులకు కంటి ఆపరేషన్లు నిర్వహించిన ఇక్కడి వైద్యులు శస్తచ్రికిత్సకు వినియోగించిన సెలైన్‌లో బ్యాక్టీరియా ఉందన్న విషయాన్ని గుర్తించకుండా, దానే్న వినియోగించారు. ఫలితంగా ఆపరేషన్లు చేయించుకున్న వారిలో 13 మంది కళ్లకు తీవ్ర ఇన్‌ఫెక్షన్ అయి కళ్లలో నుంచి చీము కారటం మొదలైంది. ఇందులో అయిదారుగురు పూర్తిగా చూపుకోల్పోయే ప్రమాదం నెలకొంది. తాము వినియోగించిన బ్యాక్టీరియాతో కూడిన సెలైన్ విషయాన్ని, ఆపరేషన్ చేసిన కళ్లకు ఇనెఫెక్షన్ అయిన విషయాన్ని రోగులకు గానీ, రోగుల సంబంధీకులకు గాను చెప్పని వైద్యులు ప్రతిరోజు రోగులను తీసుకెళ్లి కళ్లను కడిగి తీసుకువచ్చి వార్డులో వదిలేస్తున్నారు. ఆపరేషన్ చేసి వారమైనా చూపురాకపోవటంతో రోగుల బంధువులు నిలదీయటంతో బుధవారం వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది.
దీంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపేమో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదని ఆసుపత్రి వర్గాలంటున్నాయి. ఒకవైపేమో కళ్లు వస్తాయో లేదోనన్న ఆందోళనలో ఉన్న రోగులు, వారి బంధువులతో అదే ఆసుపత్రికి చెందిన మరికొందరు వైద్యుల కామెంట్లు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. రోడ్డుపై మనం వెళ్తుంటే ఏ ప్రమాదమో జరిగి కాలో, చెయ్యో పోవచ్చు..ఇదీ అలాగే అనుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లు రోగుల సహాయకులు వాపోతున్నారు. ఏ రకంగా చూపుపోయిందో, అదే రకంగా సరోజినీ దేవి ఆసుపత్రి వైద్యులు చూపుతీసుకురావల్సిందేనని పట్టుబట్టారు. అంతటితో ఆగని వారి ఆవేదన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసేలా చేసింది.