హైదరాబాద్

హరితహారం అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జూలై 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందని మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్ చెప్పారు.
శుక్రవారం డివిజన్ పరిధిలోని రాయల్ ఎన్‌క్లేవ్‌లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, అ మొక్కలు భవిష్యత్‌లో మనలను కాపాడుతాయని చెప్పారు. రోజురోజుకు పర్యావరణంలో వస్తున్న మార్పులను అధిగమించాలంటే మనవంతుగా హరితహారాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం డివిజన్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, కాలనీలలో తప్పనిసరిగా మొక్కలు నాటడానికి ప్రజలు ముందుకు రావాలని, మొక్కలు నాటడం ప్రజల బాధ్యత అని ఆయన చెప్పారు. గ్రేటర్ కో-ఆప్షన్ సభ్యురాలు గొట్టిముక్కల జ్యోతి, తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మచ్చబొల్లారం డివిజన్ తెరాస అధ్యక్షుడు బొబ్బిలి సురేందర్ రెడ్డి, నాయకులు ఉదయ్, శ్రావణ్‌కుమార్, కాంతారావు, అభినయ్, శ్రీశైలంయాదవ్, లక్ష్మణ్, హరిబాబుతోపాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.
అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో
మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమానికి సైబరాబాద్ జాయింట్ కమిషనరు టివి శశిధర్ పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. కార్యక్రమాన్ని అల్వాల్ ఏసిపి సయ్యద్ రఫిక్ పర్యవేక్షించగా ఎస్‌ఐలు రాంబాబు, రమేష్, సురేష్ పాల్గొన్నారు.
50వేల మొక్కలు నాటుతాం
కంటోనె్మంట్‌లో హరితహారం కార్యక్రమం కింద కంటోనె్మంట్‌లోని ఎనిమిది వార్డుల పరిధిలో 50వేల మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కంటోనె్మంట్ బోర్డుసభ్యుడు లోకనాథ్, జె. రామకృష్ణ చెప్పారు. శుక్రవారం తిరుమలగిరిలోని నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను వారు పరిశీలించారు. వార్డుల వారీగా కార్యాచరణ చేపట్టి ప్రజలను భాగస్వాముల్ని చేసి వార్డుల వారీగా కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు.