హైదరాబాద్

మొక్కలను దత్తత తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: భాగ్యనగరాన్ని మరింత పచ్ఛదనంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దటంతో పాటు భవిష్యత్తు తరాలను మనుగడ కోసం ఈ నెల 11న జిహెచ్‌ఎంసి నిర్వహించనున్న హరితహారం ఏర్పాట్లను కమిషనర్ జనార్దన్ రెడ్డి శనివారం నేరుగా పరిశీలించారు. శనివారం ఇందిరాపార్కులో మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా దత్తతకు తీసుకుని నిర్వాహణ బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన సూచించారు. నగరంలోని మొత్తం 4100 ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి, ఒకే రోజు సుమారు 25లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో సుమారు 104 వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేగాక, హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మొక్కలను అందించేందుకు నగరంలోని మూడు ప్రాంతాల్లో వాటిని అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ప్రగతి రిసార్ట్స్‌ల్లో లక్ష మొక్కలు నాటడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఎక్కడెక్కడ ఏ రకంగా మొక్కలు ఎంత మోతాదులో అందుబాటులో ఉన్నాయన్న సమాచారాన్ని ఇప్పటికే వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌లో మొత్తం 83 నర్సరీల్లో ఈ మొక్కలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. నగరవాసులంతా ఉత్తమమైన ప్రమాణాలతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించేందుకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మొక్కలు నాటాలన్న ఇష్టం ఉండి, ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం లేని వారు ఏ మాత్రం నిరాశకు గురి కాకుండా నర్సరీల్లో నుంచి మొక్కలు తీసుకుని, తమకు సమీపంలోని ఖాళీ స్థలాల్లో కూడా నాటవచ్చునని కమిషనర్ తెలిపారు. ఇది కేవలం ఈ నెల 11వ తేదీనే గాక, నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన ప్రకటించారు.