హైదరాబాద్

అరచేతిలో పౌర సేవలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: మహానగర పాలక సంస్థ కార్యకలాపాలు, కార్యాలయాలను కాగితపు రహిత ఆఫీసులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పలు ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చిన జిహెచ్‌ఎంసి ఇపుడు మై జిహెచ్‌ఎంసి పేరిట ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రారంభించిన వెంటనే నగరంలో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు వాడే ప్రతి ఒక్కరికీ ఈ ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానున్నట్లు గ్రేటర్ అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన ఈ యాప్‌ను వినియోగించి నగర పౌరులు జిహెచ్‌ఎంసి అందించే కొన్ని సేవలను తొలి దశగా వినియోగించుకోవచ్చునని అధికారులంటున్నారు. ఇందులో ముఖ్యంగా జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను, నగరంలోని వ్యాపార సంస్థలకు గ్రేటర్ మంజూరు చేసే ట్రేడ్‌లైసెన్సులు, ఎల్‌ఆర్‌ఎస్, బర్త్,డెత్ సర్ట్ఫికెట్లకు సంబంధించిన సమాచారాన్ని చూసుకోవటంతో పాటు అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకుని బయట ఎక్కడైనా ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ప్రజలు ఫిర్యాదులు, వాటి తాలుకూ ఫొటోలను కూడా పంపింతే అటోమెటిక్‌గా సంబంధిత అధికారికి ఈ ఫిర్యాదు చేరుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎవరు, ఎవరికి సమాచారం పంపారు? ఏ బకాయిదారుడు ఎక్కడి నుంచి ఏ రకరమైన ఛార్జీలు చెల్లించారన్న విషయాన్ని తెల్సుకునేందుకు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రస్తుతం జిహెచ్‌ఎంసి అందిస్తోన్న సేవలకు సంబంధించి ఇప్పటికే రికార్డుల్లో ఉన్న వివరాల సంబంధిత సేవలనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
ఎలా వినియోగించాలి?
నగరంలో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ వినియోగించే వారు శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల తర్వాత ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తమ ఫోన్‌లో వచ్చిన జిహెచ్‌ఎంసి యాప్‌ను క్లిక్ చేస్తే అందులో జిహెచ్‌ఎంసి సంబంధిత ఆస్తిపన్ను, పిటిఐఎన్ నెంబరు, బర్త్,డెత్ సర్ట్ఫికెట్లు, ప్రజల నుంచి ఫిర్యాదులు వంటి ఆప్షన్లు ఉంటాయి. వీటితో పాటు వీది ధీపాలు, ఖాళీ స్థలాల్లో చెత్తవేయటం, డంపర్ బిన్లు చెత్తతో నిండిపోవటం వంటి ఫిర్యాదులను అదే యాప్‌లో అదర్స్ అని ఉంటే ఫోల్డర్‌ను వినియోగించి వర్షాకాలానికి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను సైతం అధికారులకు పంపవచ్చునని తెలిపారు. ఆస్తిపన్ను బకాయిదారులు తమ సెల్‌ఫోన్ల యాప్‌ను వినియోగించుకుని క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి క్షణాల్లో చెల్లించే వెసులుబాటు అందుబాటులోకి వస్తోందని వివరించారు. అంతేగాక, చెల్లించిన వెంటనే రసీదును కూడా యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి అందుబాటులోకి రానున్న ఈ యాప్‌లో తొలి దశగా ఆస్తిపన్ను బకాయిలు, అంతకు ముందు చెల్లింపునకు సంబంధించి వివరాలు తెల్సుకోవచ్చునని అధికారులు తెలిపారు.
ఫిర్యాదుల పరిష్కారానికి 48 గంటలు
జిహెచ్‌ఎంసి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రజలు వివిధ విభాగాలకు చెందిన అధికారులకు పంపే ఫిర్యాదులను అధికారులు 48 గంటల్లో పరిష్కరించే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వర్షానికి సంబంధించిన పలు సమస్యలకు సంబంధించి సమస్యను బట్టి కొన్నింటిని 48 గంటల సమయం ఉన్నట్లు, మరికొన్నింటికి గరిష్ఠంగా 15 రోజుల వరకు సమయాన్ని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.
సాఫ్ట్‌వేర్ మొదలుకుని...
ఈ మొబైల్ యాప్ కోసం సాఫ్ట్‌వేర్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ తయారు చేసింది. ఒకసారి సాఫ్ట్‌వేర్‌ను రూపకల్పన చేయటమే గాక, మున్ముందు నిర్వాహణ బాధ్యతలు కూడా ఉన్నందున ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే మున్ముందు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తటమే గాక, ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సులకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నందున ప్రభుత్వ సంబంధిత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్‌కు అన్ని రకాల బాధ్యతలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు.