హైదరాబాద్

హక్కులపై పోరాడితే నిర్బంధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, జూలై 15: దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హక్కులపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధాలను ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్నారని ఓయు విద్యార్ధి జెఎసి ఆగ్రహం వ్యక్తం చేసంది. ఓయు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జెఎసి నాయకులు మాట్లాడుతూ ఓయు విద్యార్థి నాయకుడు ఆజాద్‌ను అక్రమ అరెస్టు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో మరో దొరలపాలనకు నాంది పలుకుతోందని తెలిపారు.
ఓయులో విద్యార్థులు సభలు, సమావేశాలను నిర్వహించుకుంటే విద్రోహులుగా చిత్రీకరిస్తూ విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయులోకి రిజిస్ట్రార్ అనుమతి లేకుండా వరంగల్ జిల్లా ములుగు పోలీసులు ప్రవేశించి విద్యార్ధి నాయకుడు ఆజాద్‌ను అరెస్టు చేయడం కేసిఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకుడిని వెంటనే కోర్టులో హాజరుపరుచాలని ఓయు విద్యార్థి జెఎసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.