హైదరాబాద్

రోడ్లకు శస్తచ్రికిత్స అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: అసలే వర్షాకాలం..మహానగరంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని, వీటికి తక్షణమే శస్తచ్రికిత్స అవసరమని రాష్టమ్రున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను మరింత త్వరితగతిన అందించేందుకు జిహెచ్‌ఎంసి రూపకల్పన చేసిన ‘మై జిహెచ్‌ఎంసి’ యాప్‌ను ఆయన శుక్రవారం ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నగర రోడ్ల పరిస్థితి ముఖ్యమంత్రి సైతం సంతృప్తిగా లేరని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం అర్థరాత్రి మూడు గంటల పాటు తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తర్వాత తనిఖీల వివరాలను సిఎంకు వివరించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు, పాలకులు అధికారుల నుంచి అద్భుతలేమీ కోరుకోవటం లేదని, వారు బయటకు వచ్చినపుడు కనీస వౌలిక వసతులుంటే చాలని భావిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా నగరంలో ఎప్పటికపుడు అవసరాలను బట్టి రోడ్లు వేయటం, వేసిన పది రోజులకే అది కొట్టుకుపోవటం పరిపాటైపోయిందని, ఇలా కాకుండా రోడ్లు నాలుగు కాలాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా రోడ్లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కూడా శాశ్వత పరిష్కారాన్ని అనే్వషిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా అధికారులు ప్రజలను నిత్యం ఇబ్బందులు పాలు చేస్తున్న చిన్న చిన్న సమస్యలపై క్రీయాశీలకంగా పనిచేయాలని సూచించారు. సమస్యల పరిష్కారం మన బాధ్యతగా గుర్తించి అధికారులు, పాలకులు పనిచేయాల్సిన అవసరముందన్నారు. నగరంలో మరిన్ని ప్రాంతాల్లో వైట్‌టాపింగ్ రోడ్లను అందుబాటులోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఇందుకు అఖిల భారత సిమెంటు తయారీదార్లతో ప్రత్యేకంగా శుక్రవారమే సమావేశం కానున్నట్లు, వారు సూచించిన ధరకు కాకుండా కాస్త తక్కువ వ్యయంతో రోడ్లను నిర్మించాలని కోరనున్నట్లు, ఆ తర్వాత సమావేశం సారాంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన వివరించారు.