హైదరాబాద్

17న మళ్లీ పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ఈ నెల 17వ తేదీన మరోసారి పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సారి సుమారు 6లక్షల 8వేల మంది అయిదేళ్లలోపు చిన్నారులకు పోలియో మందు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు గాను మొత్తం 3200 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసిన క్షేత్ర స్థాయి విధుల కోసం దాదాపు 12800 మంది సిబ్బందిని నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి రెవెన్యూ అధికారులు సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 17న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలియో మందును పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్ నగరంలో 85 సంచార బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ బృందాల ద్వారా భవన నిర్మాణ స్థలాల వద్ద ఉండే పిల్లలు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలు, పబ్లిక్ పార్కులు, మ్యారేజ్ హాల్స్ తదితర ప్రాంతాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛంధ సంస్థలు, కళాశాల విద్యార్థులు, ఎన్‌సిసి, నర్సింగ్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడి వర్కర్లు, తదితర ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీల్లో పల్స్‌పోలియో చుక్కలను వేసుకోని పిల్లలను గుర్తించి, వారికి కూడా మందును పంపిణీ చేసేందుకు ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
వచ్చే నెల 10న నేషనల్ డి వార్మింగ్ డే
ఎనిమియా, పోషకాహారంతో పాటు పలు అనారోగ్యాలకు గురయ్యే ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఫిబ్రవరి 10వ తేదీన నేషనల్ డి వార్మింగ్ కే నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. నగరంలో 8లక్షల 83వేల 153 మంది పాఠశాల, కళాశాలలకు చెందిన 19 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారని, వీరితో పాటు 17వేల 102 మంది అంగన్‌వాడి పిల్లలు, మరో 13వేల 688 రిజిస్టర్ కాని పిల్లలున్నారని, వీరికి డి వార్మింగ్ మందులను ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.