హైదరాబాద్

నిర్మాణాలపై ప్రజలకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: మహానగరం పరిధిలో ఎంత చిన్న ఇళ్లయినా, బడా షాపింగ్ మాల్ అయినా నిర్మించే వారికి, నిర్మాణానికి సంబంధించిన నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన శిబిరాలను నిర్వహించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల జారీ విషయంలో తామెన్నో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టామని, ఇందులో భాగంగానే ఆన్‌లైన్ సేవలను ప్రారంభించి కేవలం 24 రోజుల్లో నిర్మాణ అనుమతి, 15 రోజుల్లో అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు అందించేలా మార్పులు తెచ్చామని వివరించారు. అయినా అనుమతుల మంజూరీలో పారదర్శకత కోసం మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు ఎలా తీసుకోవాలి? తీసుకున్న అనుమతి ప్రకారం సెట్‌బ్యాక్, రోడ్లు, వెంటిలేషన్ వంటి అంశాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు సర్కిళ్లు, జోన్ల వారీగా ప్రతి శనివారం ప్రజలకు అవగాహన శిబిరాలను నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. అయితే ఫిల్మ్‌క్లబ్ వంటి భవనాలకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులుండటం, సుమారు 20 నుంచి 20లక్షల భవనాలు, కోటి జనాభా కల్గిన నగరానికి కేవలం వంద మంది వరకు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఉండటం కూడా అక్రమ నిర్మాణాలు వచ్చేందుకు కారణాలుగా ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటికే రోడ్లు, వీది ధీపాలు, శానిటేషన్ వంటి ఇతరత్ర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు తాను రూపొందించిన ప్రత్యేక యాప్‌కు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఫిర్యాదులు పంపటంలో స్థానికులు ఉత్సాహాన్ని చూపాలని కమిషనర్ కోరారు. ఇందుకు ‘యూజర్ ఫ్రెండ్లీ’ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ముందుకొస్తే పునరావాసం కల్పిస్తాం
నగరంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రమబద్ధీకరణ స్కీంకు గత అక్టోబర్ 28వ తేదీతో గడువు ముగిసిన తర్వాత నగరంలో అనుమతుల్లేకుండా కొనసాగుతున్న సుమారు 463 భవనాలను ఇంజనీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారని, వీటిలో కోర్టుల్లో కేసులు లేని వాటన్నింటిని కూల్చివేసినట్లు తెలిపారు. వీటితో పాటు శిథిలావస్ణకు చేరుకున్న 1997 భవనాలను కూడా గుర్తించామన్నారు. వీటిలో 752 పాతకాలపు భవనాలను కూల్చివేయగా, మరో 96 భవనాలకు సంబంధించి యజమానులే లోపాలున్నట్లు గుర్తించుకున్నట్లు తెలిపారు. మరో 200 భవనాలకు సంబంధించి ఓనర్, టెనెంట్‌కు సంబంధించి వివాదాలున్నట్లు ఆయన తెలిపారు. వీటిల్లో నివాసముంటున్న వారంతా, ముందుజాగ్రత్త చర్యగా సిద్దంగా ఉంటే వారం రోజుల్లో సమీపంలోని కమ్యూనిటీ హాళ్లలో గానీ, ఇప్పటికే నిర్మించి సిద్దంగా ఉన్న జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే ఇళ్లలో గానీ పునరావాసం కల్పిస్తామని కమిషనర్ తెలిపారు.
త్వరలో స్టాండింగ్ కౌన్సిల్‌తో సమావేశం
అక్రమ నిర్మాణాలు, కూలేందుకు సిద్ధంగా ఉన పాతకాలపు భవనాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం సహాయంతో కోర్టును కోరనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇంతకుముందే త్వరలోనే స్టాండింగ్ కౌన్సిల్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి వెకేట్ కాకుండా స్టేలు ఉండటం వల్ల కొద్దిరోజుల క్రితం పాతబస్తీ హుస్సేనీ ఆలంలో, ఇపుడు ఫిల్మ్‌క్లబ్ పోర్టికో వంటివి కూలి, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి, ఇలాంటి భవనాలకు వీలైనంత త్వరగా ఉత్తర్వులను ఉపసంహరించుకునే విధంగా కోరనున్నట్లు కమిషనర్ తెలిపారు.