హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ కార్మికులకు సకాలంలో పదోన్నతులు కల్పించి, రోస్టర్ విదానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని జలమండలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలు వినతులతో కూడిన వినతి పత్రాన్ని సంఘం ప్రతినిధులు జలమండలి పిఆండ్‌ఎ విభాగం డైరెక్టర్ అజ్మీరాకృష్ణకు వినతి పత్రం సపర్పించారు. జలమండలిలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తక్షణమే హెల్త్ కార్డులు అందజేసి, సర్కీల్-1, 2లో పనిచేస్తున్న వారికి రూల్ ఆప్ రెగ్యులైజేషన్, రోస్టర్ పద్ధతిలో పదోన్నతులు కల్పించాలని సంఘం ప్రతినిధులు డైరెక్టర్ దృష్టికి తీసుకేళ్లారు. ఉద్యోగులకు తగిన న్యాయం చేసేందుకు గాను జలమండలి ఉన్నాతాధికారులు వెంటనే డిపార్ట్‌మెంటల్ పదోన్నతుల కమిటీ సమావేశం నిర్వహించాలని జలమండలి ఎస్టీ, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం చైర్మన్, శాసన సభ్యుడు కె.యాదయ్య, వైస్ చైర్మన్ బి.శంకర్‌ప్రకాష్, లీగల్ అడ్వయిజర్ జి.విశ్వనాథన్, అధ్యక్షుడు జి.లక్ష్మినారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు డి.అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు బి.నర్సింగ్‌రావు, సీనియర్ ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఖైర్‌తాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సోమావారం డైరెక్టర్ అజ్మీరాకృష్ణను కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో ఎ.ఉదయ్ కుమార్, ఎం.మురళిస్వామి, ఎ.బాబురావు, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.