హైదరాబాద్

హరితహారం లక్ష్యం 50 శాతం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: మహానగరంలో పర్యావరణ పరిరక్షణ కోసం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో కనీసం 84లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంలో ఇప్పటి వరకు సగం శాతం పూర్తయినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరాన్ని పచ్చగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సర్కారు ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన ఒక్కరోజే 25లక్షల మొక్కలు నాటాలన్న సంకల్పంతో పెద్ద ఎత్తున హరితహారం నిర్వహించి ఒకే రోజు దాదాపు 29లక్షల 19వేల 306 మొక్కలు నాటి రికార్డును సృష్టించినట్లు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను, నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విద్యార్థులను భాగస్వాములు చేస్తూ, నేటి వరకు కూడా హరితహారం కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు మేయర్ తెలిపారు. మొత్తం 84లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం ఉండగా, సోమవారం నాటికి సుమారు 42లక్షల మొక్కలు నాటి సగం వరకు టార్గెట్‌ను పూర్తి చేసుకున్నట్లు వివరించారు. మిగిలిన మరో యాభై శాతం టార్గెట్‌ను కూడా త్వరలోనే అధిగమించేలా కార్యచరణ సిద్దంగా ఉందన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో నాటిన మొక్కలో 80 శాతం మొక్కలు ప్రహరీగోడలు ఉన్న ఖాళీ స్థలాల్లో, ఎలాంటి ఢోకా లేకుండా ఉన్నాయని తెలిపారు. ఇక మిగిలిన 20శాతం మొక్కల పరిరక్షణ, మెరుగైన పెంపకం కోసం జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు మేయర్ పేర్కొన్నారు. ఈ మొక్కలకు మూడేళ్ల పాటు ఒక్కో మొక్క వారీగా పెంపకం, నిర్వహణ బాధ్యతలను జిహెచ్‌ఎంసి చూసుకుంటుందని వివరించారు. హరితహారం కార్యక్రమం కింద దాదాపు 61లక్షల మొక్కలను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కేవలం మొక్కలను నాటడమే గాక, వాటి పెంపకం, పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినపుడే అనుకున్న సంకల్పం నెరవేరుతోందని మేయర్ రామ్మోహన్ సూచించారు.