హైదరాబాద్

అందరినీ చల్లగా చూస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, జూలై 25: నేను ప్రతి ఒక్కర్ని చల్లంగా చూస్తున్నా..అయినా నన్ను పట్టించుకోవటం లేదు..నాకు శాంతి జరగాలంటే రక్తతర్పణం చేయాలంటూ సికిందరాబాద్ బోనాల రంగంలో అవివాహిత స్వర్ణతల భవిష్యవాణి విన్పించారు. రక్తతర్పణం తనకోసం కోరుకోవటం లేదని తన చుట్టూ ఉన్న శక్తులను శాంతి చేసేందుకేనని చెప్పారు. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా రెండోరోజు కూడా సికిందరాబాద్‌లో భక్తుల కోలాహలం నెలకొంది. సోమవారం ఉదయం సైతం లక్షలాది మంది భక్తులు రంగం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని శాంతిపరిచేందుకు రక్తతర్పణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామంటూ ఆలయ నిర్వాహకులుకు అందుకు అంగీకరించారు.
రంగం కార్యక్రమం తర్వాత అంబారీపై అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టె పలు ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంత్రి తలసాని, శ్యామల వేసిన స్టెప్పులు కళాకారులు, భక్తుల్లోనూ ఒకింత ఉత్సాహాన్ని నింపాయి.
అందరి సమన్వయంతో
జాతర విజయవంతం
అన్ని వర్గాల ప్రజలు, వివిధ శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో సికిందరాబాద్ బోనాల జాతర విజయవంతమైనట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. అంబారీ ఊరేగింపు ప్రారంభించినానంతరం మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు ఆదివారం తెల్లవారుఝము నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ సారి రెట్టింపు స్థాయిలో భక్తులు హజరయ్యారని వివరించారు. జాతర విజయవంతంగానికి పోలీసు, జిహెచ్‌ఎంసి, విద్యుత్, దేవాదాయ శాఖలతో అన్ని ప్రభుత్వ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు.
సికిందరాబాద్ రైలే స్టేషన్, రాంగోపాల్ పేట ప్రాంతాల్లో ఉత్సవాలను ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు వీలుగా త్రిడి సిస్టమ్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సోమవారం రాత్రి సికిందరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఫలహారం బండ్ల ఊరేగింపులు ఆలయం వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మంత్రి తలసాని ఆయా ఫలహారం బండ్ల నిర్వాహకులను సన్మానించారు.