హైదరాబాద్

హస్తిన పర్యటనలో బల్దియా బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: భాగ్యనగరంలో ప్రజలకు జిహెచ్‌ఎంసి అందిస్తోన్న పౌరసేవల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు వివిధ అంశాలపై అధ్యయనం నిర్వహించేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంగళవారం దిల్లీ చేరుకుంది. మొదటి రోజే మేయర్, అధికారుల బృందం దిల్లీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, నగరంలో కనీస సౌకర్యాలైన టాయిలెట్లు, బస్ షెల్టర్ల ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల నిర్వాహణ, పార్కింగ్ తదితర రంగాల్లో దేశంలోని ఇతర నగరాల్లో అవలంభిస్తున్న మెరుగైన విధానాల్లో అవసరమైన వాటిని మన సిటీలో అమలు చేయాలన్నది ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. దిల్లీలో ఏ విధమైన ఆక్రమణల్లేని ఫుట్‌పాత్‌లు, ఉచితంగా ఉపయోగించుకునే టాయిలెట్లు, అందమైన ఆకృతిలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను మేయర్‌తో కూడిన అధికారుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత న్యూ దిల్లీ మున్సిపల్ చైర్మన్(ఎన్‌డిఎంసి) చైర్మన్ నరేష్‌కుమార్, సెక్రటరీ చెంచల్‌యాదవ్, ఇతర సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న వివిధ రకాల అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పౌరసదుపాయాల కల్పన, రెవెన్యూ వసూళ్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలు తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా నరేష్‌కుమార్ మాట్లాడుతూ 42.76 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న న్యూ దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో రెండున్నర లక్షల వరకు జనాభా ఉందన్నారు. అయితే ఈ నగరానికి ప్రతిరోజు దాదాపు 20లక్షల మంది అధికారిక పరిపాలన, వ్యాపార, వాణిజ్య పనులపై ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో 173 కిలోమీటర్ల ప్రధాన రహదార్లు, 181 కిలోమీటర్ల కాలనీ రోడ్లు, 132 ఫుట్‌పాత్‌లు, 11వేల 907 డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ ఉన్నట్లు తెలిపారు. తమ పరిధిలో నూతన గృహాల నిర్మాణానికి విధిగా సోలార్ విద్యుత్ ఉత్పాదన ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని నిబంధన విధిస్తున్నామని, దాదాపు 95 శానికి పైగా గృహాలకు సోలాల్ ప్యానల్స్ ఉన్నాయని వివరించారు. ఈ మున్సిపల్ ప్రాంతాలు 80 48 శాతం పచ్ఛదనంతో నిండి ఉన్నట్లు తెలిపారు. విస్తీర్ణం చిన్నదైనప్పటికీ రూ. 3వేల కోట్ల వార్షిక బడ్జెట్ కల్గి ఉందని ఆయన వివరించారు. ప్రతిరోజు 350 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్త అవుతోందని, వంద శాతం ఇళ్ల నుంచి చెత్తసేకరణ జరుగుతోందన్నారు. నగర ఫ్రజ నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులపై నిర్ణీత కాలంలో పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, పన్నుల వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, పరిపాలన సౌలభ్యంలో చేపట్టిన సంస్కరణలు, ఆధునిక విధానాలను మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు చర్చించారు. ఈ పర్యటనలో మేయర్, కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ శంకరయ్య, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, ‘ఆస్కీ’ ప్రొఫెసర్ శ్రీనివాసచారి, మేజర్ శివకుమార్, ఆర్టీసి ఇడి పురుషోత్తం ఉన్నారు.