హైదరాబాద్

భారీ వర్షం.. అంతా అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూలై 26: నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అలాగే సాయంత్రం కూడా నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. కాగా, చిన్నపాటి వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గత ప్రభుత్వాల తప్పిదాలతో రోడ్లు చెరువులవుతున్నాయని, ఈ పరిస్థితిని నుంచి నగరాన్ని విముక్తి చేయడానికి నడుం బిగిస్తున్నామని తెరాస పాలకులు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు ఈ పరిస్థితిని అధిగమించడానికి నగరంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంలో ఖచ్చితమైన జవాబులు మాత్రం కనిపించడం లేదు. అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం మినహా పరిస్థితిని అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటో అర్థం కావడం లేదు. చిన్నపాటి వర్షానికి నగరంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లతోపాటు కాలనీ బస్తీ రోడ్లు నిండుకుండలా కనిపిస్తున్నాయి. తెలియక ఎక్కడ కాలుమోపితే ఎక్కడ తేలుతామో తెలియని భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి తార్నాక, లాలాపేట్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు చేరుకుంది. రోడ్లన్ని నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా లాలాగూడ శేషాపహాడ్ ప్రాంతంలో ఈ మధ్య నిర్మించిన ఈద్గా ప్రహారిగోడ కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి పద్మారావుతోపాటు కార్పోరేటర్ ఆలకుంట సరస్వతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
నాణ్యత పాటించకుండా గోడను నిర్మించడం మూలంగా వర్షానికి కూలిపోయిందని నాణ్యత ప్రమాణాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇదొక్కటే కాదు ఇలా ప్రభుత్వ నిధులతో చేపడుతున్న నిర్మాణాలను కాంట్రాక్టర్‌లు నాణ్యత పాటిస్తున్నారా లేదో అనే విషయాలను ఎప్పటికి తనిఖీలు చేసి పరిశీలించాల్సిన అధికారులు కళ్లుమూసుకుని కాంట్రాక్టర్‌లకు కొమ్ముకాస్తుండడంతో నిర్మాణాలు ఇలా పేకమేడలా కూలిపోతున్నాయి.
జలమయమైన రోడ్లు...
నార్సింగి: నగరంలోని మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈవర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురిసింది. అయితే సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలు ట్రాఫిక్‌లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో కూడా భారీ వర్షం కురిసింది. నగరంలోని మెహిదీపట్నం, లంగర్‌హౌస్, గోల్కొండ, షేక్‌పేట్, మాసాబ్‌ట్యాంక్, మల్లేపల్లి, గుడిమల్కాపూర్, కార్వాన్, జియాగూడ, పూరానాపూల్, ధూల్‌పేట్, మంగళహాట్, గోషామహల్ తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. కాగా ఈ వర్షానికి ఎక్కడ చూసినా రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపించాయి. అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.
కంటోనె్మంట్ - అల్వాల్‌లో భారీ వర్షం
అల్వాల్: మంగళవారం కురిసిన భారీ వర్షానికి అల్వాల్, కంటోనె్మంట్‌లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. తిరిగి సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు ఆందోళకు గురయ్యారు.
బొల్లారం, మచ్చబొల్లారంలలో పైభాగం నుండి వచ్చిన వర్షం నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మచ్చబొల్లారం, తుర్కపల్లి, రైల్వేకాలనీ, రుక్మిణీదేవీ కాలనీ, సూర్యనగర్, ఓల్డు అల్వాల్ అంబేద్కర్‌నగర్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, వెస్టు వెంకటాపురం, భూదేవినగర్, లోతుకుంట, ఇందిరానగర్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, ఓల్డు బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, మహేంధ్రాహిల్స్, కంటోనె్మంట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో వాహనదారులు అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయ.