హైదరాబాద్

సాదా బైనామ రెగ్యులరైజేషన్‌లను త్వరగా పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: రెవెన్యూ శాఖలో ఉద్యోగుల క్యాస్ట్ వైజ్ వివరాల నివేదికను వారంలోపు పంపాలని, సాదాబైనామ రెగ్యులరైజేషన్‌లను త్వరితగతిన పరిష్కరించాలని భూపరిపాలన ప్రధాన కమీషనర్ రేమండ్ పీటర్ జిల్లా జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సాదాబైనామా రెగ్యులరైజేషన్, అసైన్డ్ ల్యాండ్స్ డిటెయిల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్స్, ఎఫ్‌లైన్ ఫిటిషన్స్, మ్యూటేషన్స్, ఎల్‌ఈసి దరఖాస్తుల, రెక్ట్ఫికేషన్ మాడ్యుల్, ఎస్‌ఆర్‌ఓ - తహసిల్దారు మ్యూటేషన్ పురోగతి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికలు,జిఓ 59 పురోగతి, భూదాన్ ల్యాండ్స్ వివరాల నివేదిక, రెవెన్యూ సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై జెసిలతో ఆయన సమీక్షించారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్స్ వెరిఫికేషన్స్ పూర్తయ్యిందని, గతవారమే అసైన్డ్ ల్యాండ్స్ సమగ్ర వెరిఫికేషన్ నివేదికను పంపడం జరిగిందని హైదరాబాద్ జెసి భారతి హోళికేరి సిసిఎల్‌ఎకు తెలిపారు. ఎఫ్ లైన్ పిటిషన్సలలో రెండు పరిష్కరించడం జరిగిందని, మూడు పెండింగ్‌లో ఉన్నాయని త్వరలోనే పూర్తిచేసి నివేదకను అందజేస్తామని తెలిపారు. జిఓ 59 కింద మొత్తం చెల్లింపులు చేసిన 345 దరఖాస్తులలో 248 రిజిష్టర్డ్ చేసినట్లు తెలుపుతూ, మిగిలిన వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ జిల్లా నుండి శిక్షణకు పంపాల్సిన రెవెన్యూ సిబ్బంది లిస్టు సిద్ధం చేసామని, రేపటిలోగా సమర్పిస్తామని ఆమె సిసిఎల్‌ఎకు తెలిపారు. జిల్లా రెవెన్యూ శాఖలో పని చేయుచున్న ఉద్యోగుల క్యాస్ట్ వైజ్ నివేదిక పంపామని జెసి తెలుపగా, కేటగిరి మరియు క్యాడరు వైజ్‌గా నివేదిక వారంలోపు పంపాలని సిసిఎల్‌ఎ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ మధుమోహన్ పాల్గొన్నారు.