హైదరాబాద్

ప్రపంచ అందగాడు ‘హైదరాబాదీ షాన్’ రోహిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూలై 28: ప్రపంచ అందగాడు హైదరాబాదీ రోహిత్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మిస్టర్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్న నగరవాసి రోహిత్ కండేల్‌వాల్‌కు అభినందన సత్కార కార్యక్రమం గురువారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి ఆర్టీసి కళానిలయంలో జరిగింది. రోహత్ చదువుకున్న చిక్కడపల్లిలోని అరోరా డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబ ఫసియుద్దీన్ హాజరయ్యారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం ప్రపంచానికి ఎందరో మహానుభావులను అందించిందని గుర్తుచేశారు. ఆసియా ఖండంలోనే తొలిసారిగా..అదీ హైదరాబాద్‌కు మిస్టర్ వరల్డ్ టైటిల్ దక్కటం గర్వకారణమన్నారు. పేపర్‌బాయ్‌గా జీవితాన్ని ప్రారంబించి రాష్టప్రతి స్థాయికి ఎదిగిన కలాం కెరీర్ హైదరాబాద్ నుండే ప్రారంభమయిందన్నారు. ప్రతి విద్యార్ధి చదువుతోపాటు సృజనాత్మకత, నైపుణ్యత పెంపొందించుకునే అంశాలవైపు దృష్టి సారించాలని సూచించారు. రోహిత్ అరోరా కశాశాలలో డిగ్రీ చదివి ముంబై వెళ్లి మోడల్‌గా, యాంకర్‌గా, నటుడిగా బహుముఖ ప్రతిభాపాటవాలతో ప్రపంచస్థాయికి చేరుకోవటం హైదరాబాద్‌కు గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్ధి రోహిత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కేవలం చదువు కోసమే చదువొద్దు..జీవించడానికే చదువుకాదు..దేశానికి, ప్రాంతానికి వనె్న తెచ్చే రీతిలో జీవితంలో చిరస్థాయిగా నిలబడాలన్నారు. బాబా ఫసియుద్ధీన్ మాట్లాడుతూ రోహిత్ మిస్టర్ వరల్డ్ టైటిల్ సాధించటం నగరానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమన్నారు. హైదరాబాద్ షాన్‌ను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన రియల్ హీరో అని అభివర్ణించారు.
ప్రపంచ అందగాడు ఎవరంటే మా తెలంగాణ వాడు, మా హైదరాబాద్ వాడు, మారోహిత్ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.కార్యక్రమంలో చిక్కడపల్లి ఎసిపి జె.నర్సయ్య, కళాశాల ప్రిన్సిపల్ విశ్వనాథం బులుసు పాల్గొన్నారు. కాగా, మిస్టర్ వరల్డ్-2016 టైటిల్ కైవసం చేసుకున్న హైదరాబాద్ నగరవాసి రోహిత్ కండేల్‌వాల్ గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి నేరుగా తాను చదువుకున్న చిక్కడపల్లిలోని అరోరా డిగ్రీకళాశాలకు చేరుకుని, మర్యాదపూర్వకంగా కశాశాల ప్రిన్సిపల్, స్టాప్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఆర్టీసి కళానిలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయసత్కార కార్యక్రమానికి విద్యార్థుల సమక్షంలో ఓపెన్ టాప్ జీపులో మేళతాళాల మధ్య, పండగ వాతావరణంలో ర్యాలీగా వెళ్లారు.
ముఖ్యఅతిధిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, గ్రేటర్ డిప్యూడీ మేయర్ బాబా ఫసియుద్ధీన్, చిక్కడపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పొలీస్ జోగుల నర్సయ్య, అరోరా డిగ్రీ కళాళాల ప్రిన్సిపల్ విశ్వనాథం బులుసు హాజరయ్యారు. విద్యార్ధుల సమక్షంలో రోహిత్‌ను గజమాలతో సత్కరించి, భారీ అభినందన మెమొంటోను బహూకరించారు.