హైదరాబాద్

ప్రజల కనీస అవసరాలపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 28: హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం మొదట ప్రజల కనీస అవసరాలు తీర్చే విషయంపై దృష్టి సారించాలని బస్తి వికాస్ మంచ్ డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంచ్ ప్రతినిధులు జాస్విన్ జైరత్, నళిని, వెనె్నల మాట్లాడుతూ పేద, మద్యతరగతి ప్రజలు నివసించే బస్తీలలో వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే వారు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బస్తీలలో రక్షిత మంచినీరు అందక ఆయా బస్తీలలో నివసించే వారు ఆనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు కాలనీలు, పెద్దలు నివసించే ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత నిస్తుండటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. నిత్యం పొంగిపొర్లే డ్రైనేజీలు, మూతలు లేని మ్యాన్‌హోల్స్, వెలగని వీధి దీపాలు తదితర సమస్యలు బస్తీవాసులను వెంటాడుతున్నాయని చెప్పారు. పేదవర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. పాఠశాలల్లో మంచినీరు అందని ద్రాక్షగానే మారిపోతుండగా, టాయిలెట్ల కోసం భవనాలు నిర్మించి వదిలివేస్తున్నారని ఆరోపించారు. నీటి వసతి కలిగిన టాయిలెట్లు ఉన్నప్పుడే ప్రయోజనం అని అన్నారు. సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధినులు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పారు. అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలలను ఉపయోగించలేక నీటిని తక్కువగా తీసుకుంటున్న విద్యార్ధినులు కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై విద్యాశాఖాధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.