హైదరాబాద్

పదిరోజుల్లో పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: విద్యుత్ శాఖ తరపున అండర్‌గ్రౌండ్ కేబుళ్లు, జలమండలి ఆధ్వర్యంలో వాటర్‌పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్న శ్రీనగర్‌కాలనీ రోడ్డు పునరుద్ధరణ పనులు పదిరోజుల్లో పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన శ్రీనగర్‌కాలనీ రోడ్డు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 1295 మీటర్ల పొడువు ఉ న్న ఈ రోడ్డు మార్గంలో 895 మీటర్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన మరో 300 మీటర్ల రోడ్డు పనులను మరో పదిరోజుల్లో పూర్తి చేయనున్నట్లు ఇంజనీర్లు కమిషనర్‌కు వివరించారు. ఈ మార్గంలో 132కెవి ఎలక్ట్రికల్ కేబులింగ్ ప నులు పురోగతిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నీటి సరఫరా, సీవరేజీల లైన్లకు సంబంధించి 59 సెక్షన్లను పునరుద్దరించటం జరిగిందని ఇంజనీర్లు కమిషనర్‌కు వివరించారు. నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న శ్రీనగర్‌కాలనీ రహదారి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే! దీనిలో భాగంగా పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు గాను శ్రీనగర్‌కాలనీ మార్గాన్ని డా. బి.జనార్దన్ రెడ్డి మరో సారి తనిఖీ చేశారు. జిహెచ్‌ఎంసి ద్వారా రోడ్డు నిర్మాణ పనును ప్రారంభించామని, మిగిలిన 300 మీటర్ల రోడ్డును పదిరోజుల్లో పూర్తి చేయగలమని కమిషనర్‌కు ప్రశ్నకు ఇంజనీర్లు సమాధానంగా చెప్పారు. అదనపు సిబ్బందిని నియమించైనా పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ వారికి సూచించారు. అయితే ఈ పనులు లేని వద్ధ ఎప్పటికపుడు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, రోడ్డుపై గుంతలు లేకుండా చేయటంతో పాటు వర్షమపు నీరు నిల్వకుండా తొలగించాలన్నారు. ఇరుకుగా మారిన ఈ రోడ్డుపై చెత్తను తొలగించటంతో పాటు వర్షాకాల అత్యవసర బృందాలతో రోడ్లను ఎప్పటికపుడు తనిఖీలు చేయించాలన్నారు. ఎక్కడ రోడ్లు తవ్వినా, రోడ్ల నిర్మాణ పనులు జరిగినా, అక్కడ పనులకు సంబంధించిన వివరాలతో బోర్డులను, సంబంధిత అధికారుల ఫోను వివరాలను కూడా పేర్కొనాలని ఆదేశించారు. వర్షాకాలం తర్వాతే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి బిటి రోడ్డును నిర్మించడం జరుగుతుందని జిహెచ్‌ఎంసి మేజర్ రోడ్డు డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ అశోక్‌రెడ్డి కమిషనర్‌కు వివరించారు. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ రోడ్డు మార్గంలో వర్షాల వల్ల గుంతలు ఏర్పడటం, నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికపుడు తగిన చర్యలు చేపడుతున్నామని వివరించారు. దాదాపు మూడు నెలల సమయం పట్టే ఈరోడ్డు నిర్మాణాన్ని అదనపు సిబ్బందితో నిరంతర పర్వవేక్షణతో రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు.