హైదరాబాద్

ఎవరో చేసిన తప్పుకు మేము బలి కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రతాబాద్, జూలై 28: ఎంసెట్ -2 రద్దు చేయవద్దంటూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తెలంగాణ సచివాలయం ముందు ఆందోళన దిగారు. గురువారం మధ్యాహ్నం సెక్రెటరియేట్ వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఎవరో చేసిన తప్పుకు తమను బలిచేస్తారా, లీకేజీకి కారణం ఒకరైతే తమ పిల్లల భవిష్యత్‌ను పాడుచేస్తారా అంటూ నినాదాలు చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు కదిలేదిలేదంటూ భీష్మించుకు కూర్చొన్నారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ సిఐడి వర్గాలు లీకేజీ ఏ స్థాయి వరకు జరిగిందో గుర్తిసే రద్దు చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా లీకేజీ వల్ల చాలా మంది లబ్దిపొందారనుకుంటే రద్దుచేయడం అనివార్యం అవుతుందన్నారు. దీంతో తల్లిదండ్రులు కల్పించుకొని తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా కోర్టుకు వెళ్లాలని సూచించారు.
రద్దు చేస్తామనడం సరికాదు
పేపర్ లీకేజీ పేరుతో ఎంసెట్ -2 రద్దుచేస్తామనడం సరికాదు. ఎంతో శ్రమిస్తే నా కుమార్తె పీ. చైతన్యలహరికి ఎంసెట్-2లో 385వ ర్యాంకు వచ్చింది. పాపకు వచ్చిన ర్యాంకు ప్రకారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో గాని, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో గాని సీటు పొందే అవకాశం ఉంది. రద్దుచేస్తే ఇంత కాలం పడ్డ శ్రమ వృదా అవుతుంది. మరోమారు పరీక్ష అంటే పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. పేపర్ లీకేజీతో సంబందం ఉన్నట్టు గుర్తించిన వారి ర్యాంకులను రద్దుచేస్తే సరిపోతుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.
- లక్ష్మినారాయణ, చిక్కడపల్లి వాసి.
ప్రతిభగల విద్యార్థులకు అన్యాయం సరికాదు
రద్దు నిర్ణయం సరికాదు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు కోసం ఎంతో కష్టపడ్డా. నిమిషం సైతం వృథాచేయకుండా శ్రద్దగా చదివితే 221వ ర్యాంకు వచ్చింది. ప్రభుత్వం పరీక్షను రద్దుచేసే యోచనలో ఉందని తెలియగానే షాక్ అయ్యా. అమ్మానాన్నలు సైతం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తప్పు ఒకరు చేస్తే మరొకరిని శిక్ష విధిస్తారా..?, ఇదేం న్యాయం. మరోసారి ఎంసెట్ పరీక్ష రాయాలంటే అంత శ్రద్ద చూపలేం. ఒత్తిడి కారణంగా గతంలో రాసిన విధంగా పరీక్ష రాయలేక పోతే నష్టపోయేది ఎవరు. దోషులను శిక్షించే క్రమంలో ప్రతిభగల విద్యార్ధులకు అన్యాయం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. సిఎం కేసిఆర్ జోక్యం చేసుకొని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని భావిస్తున్నా.
- రోహిత్, విద్యార్ధి
ఇది ప్రభుత్వ వైఫల్యమే
లీకేజీకి ఎలాంటి సంబందం లేని పిల్లలను బలి పశువులను చేయాలనుకోవడం మహా పాపం. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కారణంగానే పేపర్ లీకేజీ అయింది. దానికి భాద్యులను గుర్తించి లీకేజీ వల్ల లబ్దిపొందిన వారిని గురించి వారి ర్యాంకులను రద్దుచేస్తే సరిపోతుంది. దీని కోసం మొత్తం విద్యార్ధులను ఆందోళనకు గురిచేయడం సరికాదు. ఈ సారి కూడా పేపర్ లీకేజీ కాదని ప్రభుత్వం బరోసా ఇవ్వగలదా..?, గతంలో లీకేజీ అయినప్పుడు దోషులకు శిక్షలు సక్రమంగా పడ్డాయా..? వీటన్నింటి వదిలిపెట్టి పరీక్షను రద్దుచేసి తిరిగి పెడతామనడం కరెక్ట్ కాదు.
- శ్రీనివాస్, ఉప్పల్ వాసి.