హైదరాబాద్

శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 29: జిహెచ్‌ఎంసి సెంట్రల్ జోన్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్టు జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జోనల్ పరిధిలో సర్కిళ్లవారీగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పురాతన భవనాలను గుర్తించినట్టు చెప్పారు. సర్కిల్ -7లో 110, సర్కిల్ -8లో 200, 9లో 200, 10లో 60 భవనాలు ఉన్నట్టు చెప్పారు. పురాతన భవనాల పటిష్టతపై జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు, జెఎన్‌టియూ ఇంజనీర్ల బృందం పరీక్షలు నిర్వహిస్తాయని చెప్పారు. సదరు బృందం భవనాల వారీగా పరీక్షలు నిర్వహించి మరమత్తులు చేసే అవకాశాలు లేవని తెల్చే భవనాలను ఆలస్యం చేయకుండా కూల్చివేస్తామని వివరించారు. కొద్దిపాటి మరమ్మతులు చేస్తే మరికొంత కాలం వరకు పనిచేస్తుందని నిర్ణయిస్తే అందుకు అవకాశం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఖైరతాబాద్ ఇందిరానగర్‌లోని భవనాలను కూల్చివేసేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ఆయా భవనాల్లో నివసించే వారు ఖాళీ చేయకపోవడంతో కూల్చివేతలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని వివరించారు. గతంలోనే నోటీసులు జారీ చేసిన భవనాల్లో నిర్మిస్తున్న వారు జరగబోయే ప్రమాదాన్ని గమనించి భవనాలు ఖాళీ చేయాలని సూచించారు. నోటీసులను లెక్కచేయకుండా అందులోనే నివసిస్తామంటే కూల్చివేతల సమయంలో ఇబ్బందులు పడతారని చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనను నిరోధించేందుకు జోనల్ పరిధిలో మరుగుదొడ్లను నిర్మించనున్నట్టు కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇప్పటికి బస్తీలలో నివసిస్తున్న వారు మరుగుదొడ్లు లేకపోవడంతో బహిరంగ విసర్జన చేస్తున్నారన్నారు. ఈ విషయంపై బస్తీలవారీగా సర్వే కొనసాగుతుందని, అవకాశాన్ని బట్టీ వ్యక్తిగతంగా నిర్మించాలా లేక సామూహికంగా నిర్మించాలా అనేది నిర్ణయిస్తామని చెప్పారు. స్వచ్చ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వీటిని నిర్మించనున్నామని వివరించారు. హరితహారంలో భాగంగా జోనల్ పరిధిలో 7 లక్షల 20 వేల మొక్కలు పంపిణీ చేశామని, త్వరలోనే మరో నాలుగు లక్షల మొక్కలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
శిథిలావస్థకు చేరిన ఇళ్ల కూల్చివేత
రాజేంద్రనగర్: వర్షాలు కురుస్తుండటంతో పురాతనమైన ఇళ్లు తడిసి ముద్దై కూలడానికి సిద్ధంగా ఉండటంతో వాటిని ఎట్టకేలకు కూల్చారు. శుక్రవారం సర్కిల్ పరిధిలోని అత్తాపూర్, బుద్వేల్, మైలార్‌దేవ్‌పల్లి బస్తీలలో పురాతన ఇళ్లను కూల్చివేశారు. బుద్వేల్లోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని సైతం కూల్చివేశారు. సర్కిల్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించడానికి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంటనే జేసీబీల సహకారంతో ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఇంటి యజమానులకు నోటీసులు అందజేసి కూల్చివేస్తున్నారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటిని కూలుస్తున్నట్టు డిసి దశరథ్ తెలిపారు.