హైదరాబాద్

పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసే ఔషధ ప్రయోగశాలల విధానాలను మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూలై 29: పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఉన్న మానవ ఔషధ ప్రయోగశాలల విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మార్చాలని తెలంగాణ ప్రజారోగ్య పరిరక్షణ సంఘం, మానవ ఔషధ ప్రయోగశాలల కార్యకర్త హక్కుల, సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో మానవ ఔషధ ప్రయోగశాలల కార్యకర్త హక్కుల, సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సాబిర్ అలీ, తెలంగాణ ప్రజారోగ్య సంరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సంపత్‌లు మాట్లాడుతూ వివిధ ఔషధాలను తయారు చేసే సంస్థలు పేదలకు వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, ఔషధాలను ప్రయోగిస్తూ వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయని, దీనిపై చేపట్టనున్న భవిష్య కార్యచరణను వెల్లడిస్తూ, కరపత్రం కూడా ఆవిష్కరించారు. షేక్ సాబిర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి ల్యాబ్ నుంచి పూర్తి స్థాయి గుర్తింపు ప్రయోజనాలు, భవిష్యత్తు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జీవన ఆధారిత ప్రయోజనాలను సాధించేందుకు ఉద్యమించనున్నట్లు తెలిపారు. ఈ రకమైన ప్రయత్నం తాను ఇదివరకే చేసినా, గుర్తుతెలియని కొందరు తనను హతమార్చేందుకు దాడులు చేసిన సందర్భాలున్నట్లు ఆయన వివరించారు. వైద్య రంగంపై ఏ మాత్రం అవగాహన లేని పేదలను టార్గెట్ చేసుకుని చెర్లపల్లిలోని విమ్‌టా ల్యాబ్స్, ఆక్సిన్ ల్యాబ్స్, బయో సర్వ్ ల్యాబ్స్‌లతో పాటు ఉప్పల్, హయత్‌నగర్, బాలానగర్, రామంతాపూర్‌లలో ఉన్న ల్యాబ్స్‌లతో పాటు వివిధ కార్పొరేటర్ ఆసుపత్రుల్లోని మానవ ఔషధ ప్రయోగశాలలు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ ల్యాబ్‌లు చేస్తున్న అక్రమాలపై గతంలోనే జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా, సర్కారు అలసత్వం మూలంగా ఔషధ ప్రయోగశాలలు ప్రతి సంవత్సరం 300 నుంచి 700 మంది పేదల ప్రాణాలను బలిగొంటూ, ఏటా రూ. 3500 కోట్ల వరకు వ్యాపారాన్ని చేసుకుంటున్నాయని వివరించారు. ఔషధ ప్రయోగశాల్లో మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు మొదలుకుని రూ. 40లక్షల వరకు నష్టపరిహారం అందించాలని గతంలో ప్రభుత్వాలు ఆదేశించినా, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని అలీ వాపోయారు.
ఈ ఔషధ ప్రయోగశాలల విధానాల పట్ల వివిధ సామాజిక, రాజకీయ, ప్రజాసంఘాలను కలుపుకుని మున్ముందు సామాజిక ఉద్యమాన్ని చేపడుతామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి అజయ్, రాహుల్ పాల్గొన్నారు.