హైదరాబాద్

తెలంగాణ గురించి తెలిపే చిత్రాలు తీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వంటి అనేక అంశాలను ప్రజలకు తెలియజేసేలా మరిన్ని చిత్రాలు తీయాలని నిర్మాతలకు ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు పిలుపునిచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘అంపశయ్య’ నవలా ఆధారంగా చిత్రీకరించిన ‘క్యాంపస్ అంపశయ్య’ సినిమా ఈ నెల 30న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు గ్రేటర్ హైదరాబాద్ బిజెపి సినిమా సెల్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఈ సందర్భంగా యూనిట్‌ను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంపశయ్య నవలా ఆధారంగా చేసుకుని ఈ సినిమా చిత్రీకరించటం ఎంతో సంతోషకరమని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాతల సినిమాలు తప్ప, చిన్న సినిమాలు కన్పించని నేటి తరుణంలో ఎంతో వ్యయప్రయాసలు పడి ఈ సినిమా తీయటం పట్ల ఆయన యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగే అన్ని రకాలైన కార్యక్రమాలు, పరిస్థితులు, పరిణామాల మధ్య విద్యార్థులెలా ఉంటారు? అన్నది చిత్రంలో చాలా స్పష్టంగా కన్పిస్తోందన్నారు. ఈ రకంగా తెలంగాణ గురించి తెలియజేసే మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావల్సిన అవసరముందన్నారు. ఈ సినిమా మంచి కలెక్షన్లను సంపాదించటంతో పాటు యూనిట్‌కు మంచి పేరు కూడా తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి సినిమా సెల్ కన్వీనర్ సివిఎల్ నర్సింహారావు ఆధ్వర్యంలో నగర బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి సభాధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి చిత్ర కథానాయకుడు శ్యామ్‌కుమార్, కథానాయకి పావని, వౌనిక థామ్సన్, నిర్మాత, దర్శకులు ప్రభాకర్ జైన్, సంగీత దర్శకులు ఘంటసాల విశ్వనాధ్, కెమెరా మెన్ రవికుమార్ నిర్ల, క్రియేటీవ్ హెడ్ తిరుపతిరెడ్డి కోట, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.