హైదరాబాద్

కొనసాగుతున్న కూల్చివేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: వర్షాకాలం ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారిన నగరంలోని శిథిల భవనాల కూల్చివేత పనులు శనివారం కూడా కొనసాగాయి. కొద్దిరోజులుగా పాతబస్తీ హుస్సేనీ ఆలం, సికిందరాబాద్ మోండామార్కెట్ ప్రాంతంలో ఈ శిథిల భవనాలు, అలాగే వారం రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఫిల్మ్‌క్లబ్‌లో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలతో స్పందించిన జిహెచ్‌ఎంసి కమిషనర్ శిథిల భవనాల కూల్చివేత పనులను నిరంతరంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో ఈ ఆదేశాలు ఎంతవరకు అమలవుతున్నాయన్న విషయాన్ని ఆయన శనివారం తనిఖీ చేశారు. సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు కూల్చిన భవనాలను తనిఖీ చేశారు. అంతేగాక, పారిశుద్ధ్య పనులను కూడా కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. గడిచిన మూడు రోజుల నుంచి జిహెచ్‌ఎంసి కూల్చేస్తున్న శిథిల భవనాల సంఖ్య శనివారం నాటికి 25కు చేరింది. ఇప్పటికే రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్, బుద్వేల్, మైలార్‌దేవులపల్లి, సౌత్ జోన్‌లోని గౌలీపురా, ఈదీబజార్, బేగంబజార్, చుడీబజార్, గొల్లబస్తీ, శేరిలింగంపల్లి సమీపంలోని రాయదుర్గం, సికిందరాబాద్ లాలాగూడ, కుమ్మరిగూడ ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగాయి. కూల్చేయాల్సిన భవనాలు ఇంకా వందల్లో ఉన్నందున, తరుచూ వర్షాలు కురుస్తున్నందున ‘కోర్టు స్టే’లు ఉన్న భవనాలు మినహా మిగిలిన భవనాల్లో కూలేందుకు సిద్దంగా ఉన్న భవనాలను గురించి ప్రాధాన్యత క్రమంలో కూల్చివేస్తూ, ప్రజల ప్రాణాలకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని మరోసారి కమిషనర్ అధికారులను ఆదేశించారు. అంతేగాక, శిథిల భవనాల్లో నివాసముంటున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేయాలని కోరారు. కానీ నగరంలోని మొత్తం 24 సర్కిళ్లలో ఈ శిథిల భవనాలు ఎక్కువగా సర్కిల్ 18 సికిందరాబాద్, అలాగే పాతబస్తీలోని సర్కిల్ 4,5ల్లో ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని వర్షాకాలాల్లో వాటింతట అవే కూలిపోగా, ప్రస్తుతం ప్రమాదం అంచున ఉన్న వాటిని అధికారులు తొలగిస్తున్నారు. కానీ పదేళ్ల క్రితం నగర పాలక సంస్థలో విలీనం చేసిన శివార్లలోని పనె్నండు మున్సిపల్ సర్కిళ్లలోనే వీటి సంఖ్య ఇంతకన్నా ఎక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. అప్పట్లో ఈ ప్రాంతాల్లోని పెంకుటిళ్లు, మట్టితో నిర్మించిన ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేసి, వారి స్పందించని పక్షంలో కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో కమిషనర్‌తో పాటు సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, నార్త్‌జోన్ జోనల్ కమిషనర్ హరి చందన, సూపరింటెండెంట్ ఇంజనీర్ కిషన్ కూడా ఉన్నారు.