హైదరాబాద్

గండిపేటకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చే ప్రధాన జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమయత్‌సాగర్ (బుద్వేల్ చెరువు) కొనే్నళ్లుగా నీటి మట్టాలు అడుగు అంటి పోయాయి. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్ గండిపేట్ ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకుంది. ఎట్టకేలకు గండిపేట జలాశయానికి జలకళవచ్చింది. నాలుగు, ఐదు సంవత్సరాల నుంచి ఆశీంచిన విధంగా వర్షాలు లేకపోవడంతో జలాశాయాల్లో నీటి మట్టాలు పూర్తిగా అడుగంటాయి. మూడు నెలల క్రితం జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవడంతో జలమండలి అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. నిన్న మొన్నటి వరకు జలాశయంలో రాళ్లుతెలి కన్పించిన జలాశయంలో ప్రస్తుతం నాలుగు అడుగుల మేర నీరు వచ్చి చేరిందని జలమండలి మేనేజర్ వెంకట్రావు తెలిపారు. జలాశయానికి ఎగువ ప్రాంతాలైన నావబుపేట, శంకర్‌పల్లి, మొయినాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో ముసీలో వరద నీరు భారీ ఎత్తున పారుతొంది. దీంతో జలాశయంలోకి మోస్తారు వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలశయంలోకి సోమవారం నాటికి నాలుగు అడుగుల మేర నీరు వచ్చి చేరిందని జలాశయం మేనేజర్ తెలిపారు. జలాశయంలోకి కొత్తనీరు వచ్చి చేరుతోందని తెలిసిన పర్యటకులు పెద్ద ఎత్తున వచ్చి తిలకిస్తున్నారు. దీంతో జలాశయ ప్రాంతం పర్యటకులతో జలకళను సంతరించుకుంది. హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల్లో ఒకటైన హిమయత్‌సాగర్‌లో మాత్రం నీటి మట్టం దాదాపుగా అడగంటే దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ జలాశయంలో రాళ్లు తెలాయి. ఈ జలాశయానికి ఎగువన ఉన్న ప్రాంతాలైన పరిగి, పూడురు, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంషాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఈసీలోకి వరద ప్రవాహం రావడంలేదు. భారీ వర్షం రావడంతో ఈసీలోకి ఓ మోస్తరుగా వరద ప్రవాహం రాగా శంషాబాద్ మండలం మల్కారం వరకు వచ్చిన వరద ప్రవాహం అక్కడే ఆగిపోవడంతో హిమయత్‌సాగర్‌లోకి నీరువచ్చి చేరడంలేదు. పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తేగాని జలాశయంలోకి నీరు వచ్చే అవకాశం కన్పించడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తీని తీరుస్తున్న జంట జలాశయల్లో నీరు ఉన్నపుడు హిమయత్‌సాగర్ నుంచి ప్రతి రోజు 15 ఎంజిడిలు, గండిపేట నుంచి 20 నుంచి 25 ఎంజిడిల నీటిని ప్రజల అవసరాల నిమిత్తం జలమండలి సరఫరా చేసేది. జంట జలాశయాల్లో నీటి మట్టలు పడిపోవడంతో కృష్ణా, గోదావరి జలాలే నగర ప్రజల దాహార్తీని తీరుస్తున్నాయి. హిమయత్‌సాగర్ ఎగువ ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలిగించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికి ఏ ఒక్కరు సహసించడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారిన జంట జలాశయాల విషయంలో ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని సర్వత్ర విన్పిస్తోంది.
తెలంగాణ వచ్చినా..సామాన్యుడికి స్వరాజ్యం ఇంకా రాలేదు :టిఎస్‌పి
ఎల్‌బినగర్, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తుకోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. సామాన్యుడికి మాత్రం ఏమాత్రం స్వరాజ్యం రాలేదని తెలంగాణ స్వరాజ్ పరిషత్ కన్వీనర్ ఎంఎ ముజీబ్ పేర్కొన్నారు. సోమవారం ఆర్కెపురం డివిజన్ పరిధిలోని బిజెఆర్ భవన్‌లో టిఎస్‌పి ఆధ్వర్యంలో ప్రజాకవి దివంగత గూడ అంజయ్య సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్, చంద్రయ్య, ప్రజాకవయిత్రి విమలక్కలు హాజరయ్యారు. గూడ అంజయ్య మనలో లేకున్నా.. ఆయన రచనలు, పాటలు అందరి మదిలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర సాధనలో గూడ అంజయ్య పాత్ర ఎనలేనిదని కొనియాడారు. బంగారు తెలంగాణ దిశగా సామాన్య ప్రజలకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, గూడ అంజయ్య లాంటి ఎంతో మంది కుటుంబాలకు ప్రభుత్వం కనీసం 200గజాల స్థలం కూడా కేటాయించకపోవడం బాధకరమని, తెలంగాణ ఉద్యమ ఊసే తెలియని సానియామీర్జాకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి రూ.5కోట్లు ఇవ్వడం సిగ్గుచేటుగా ఉందని ఎంఎ ముజీబ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి ప్రణాళికలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తన పాలనను సాగిస్తుందని అన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, క్రిస్టియన్‌లకు సరైన రిజర్వేషన్‌లు కల్పించకుండా ప్రభుత్వం తన పాలనను కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో తనదైన శైలిలో తన పాటల రచనలతో తెలంగాణ లోకానికి నిద్రలేపిన గూడ అంజయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆదుకోలేని పరిస్థితిలో ఉండటం తెలంగాణ ప్రజాలోకానికి సిగ్గుచేటుగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం జరిగే వరకు తెలంగాణ సమాజ్ పరిషత్తు పోరాటాలు సాగిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మణిరాంనాయక్, సిహెచ్ యాదగిరి, శివలింగంగౌడ్, సిహెచ్ శ్రీహరి, ఎంఎంఖాన్, దేవ దనమయ్య, టి.లక్ష్మీదేవి, ఎ.అభిరామ్ పాల్గొన్నారు.