హైదరాబాద్

ఉద్యోగులతో జలమండలి ఎండి దానకిషోర్ ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: జలమండలి చేపడుతున్న వివిధ కార్యక్రమాలు విజయవంతం కవాలంటే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు కలిసి కట్టుగా పనిచేసినపుడే అది సాద్యమవుతుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ అన్నారు. వాటర్ బోర్డులో పని చేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులతో కలిసి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఖైర్‌తాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇనిస్టిట్యూట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగుల నుంచి బోర్డు అభివృద్ధి పథంలో నడువడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి బోర్డు అమలు చేస్తున్న అక్రమ నీటి కనెక్షన్ల క్రమబద్ధీకరణ స్కీం (విడిఎస్)ను తీసుకువచ్చామని, మేనేజర్ స్థాయిలో క్యాంపులు నిర్వహించి ఇంత కాలం బిల్లు రాని, ఇళ్లకు అక్రమ కనెక్షన్లు కలిగిన వారికి నోటీసులు ఇవ్వాలని చెప్పారు. మీటర్లపై ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి మీటర్ పెట్టుకోమని తెలియజెయాలని సూచించారు. బోర్డు ప్రస్తుతం లోటు బడ్జెట్‌తో సతమతమవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతినెలా ఆదాయం పెంచుకుంటు పోతేనె నష్టాలను తగ్గించుకోవచ్చని చెప్పారు. అక్రమ నీటి కనెక్షన్ కలిగినవారి వివరాలు తెలియజేసిన నగర పౌరులకు, లైన్‌మెన్‌లకు నగదు బహుమతులను అందజేస్తామని ఎండి పేర్కొన్నారు. బిపిఎల్ పరిధిలోపు కుటుంబాలకు ఒక రూపాయికే నీటి కనెక్షన్ ఇస్తామని, జలమండలి మన అందరిది, వాటర్ బోర్డులో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కష్టపడి సంస్థ బాగు కోసం పనిచేసి నగర ప్రజలకు మొరుగైన సేవలందించాలని ఎండి కోరారు. క్షేత్ర స్థాయిలో మేనేజర్లు ప్రతి స్థాయి ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనాన్నరు. నగరంలోని వివిధ బస్తీలో ఇరుకు గల్లీలు ఉండటంతో డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టేందుకు త్వరలో చిన్న ఎయిర్‌టెక్ మిషన్లను సమాకురుస్తున్నామని ఎండి తెలియజేశారు. జలమండలి దాదాపు ఆరువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, మన పని సంస్కృతి మార్చుకుని ప్రజల మన్ననలు పొందాలని ఉద్భోదించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 1న జలమండలి వ్యవస్థాపక దినోత్సవం రోజున సత్కారాలు, బహుమతులను అందజేస్తామని చెప్పారు. వంద లీటర్ల నీటి సరఫరాలో 30 లీటర్ల వృథా అవుతున్నాయని, సరఫరా చేసే ప్రతి లీటర్ నీటికి బిల్లు రావాలని, వాటర్ పైప్‌ల నుంచి అక్రమంగా నీటి లాగటానికి మొటార్లు వాడేవారి వివరాలు, ఇంటి చిరునామాలు జలమండలికి సంబంధించిన ఉన్నాతాధికారులకు ఇవ్వండి, వారిపై బోర్డు పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని సిబ్బందికి గుర్తు చేశారు. అనంతరం అక్రమ నీటి కనెక్షన్‌ను క్రమబద్ధీకరించేందుకు బోర్డు చేపడుతున్న విడిఎస్ స్కీంకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. బోర్డు ఇడి, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, రవీందర్‌రెడ్డి, డి.శ్రీ్ధర్‌బాబుతో పాటు సిజిఎం, జిఎం, డిజిఎం పాల్గొన్నారు.