హైదరాబాద్

కమాన్ నిర్మాణానికి అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: కూకట్‌పల్లిలోని గేటెడ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న కమాన్ మంగళవారం కూలటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై గ్రేటర్ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలియగానే ఆయన హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన వెంటనే సెంట్రల్ మాన్సూన్, టౌన్‌ప్లానింగ్ ఎమర్జెన్సీ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని అధికారులు కమిషనర్‌కు వివరించారు. అయినా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ నరేందర్‌గౌడ్‌లను ఆదేశించారు.
వసంత్‌నగర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఈ కమాన్‌కు సంబంధించి సిఐటి గేటెడ్ కాలనీ నిర్మాణానికి 2014లో నిర్మాణ అనుమతి తీసుకున్నా, నిర్మాణ అనుమతి పత్రాలో గేటెడ్ కమ్యూనిటీ కమాన్‌ను నిర్మిస్తున్నట్లు ఎక్కడా చూపలేదని, అది అక్రమ నిర్మాణంగానే పరిగణిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉండగా, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ ఘటన స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన కార్మికులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వారికి అత్యంత మెరుగైన చికిత్సను అందజేయాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని డిప్యూటీ మేయర్ కోరారు.
‘్ఫల్మ్‌క్లబ్’ ఘటనపై జిహెచ్‌ఎంసికి జెఎన్‌టియు నివేదిక
ఇంజనీరింగ్ నైపుణ్యత లోపం..నాసిరకం సామాగ్రితోనే కూలినట్లు వెల్లడి
గత నెల 24వ తేదీన జూబ్లీహిల్స్ ఫిల్మ్‌క్లబ్ ఆవరణలో నిర్మిస్తున్న పోర్టికో కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనకు సంబంధించి మిగిలిన భవనం స్ట్రక్చరల్ స్టెబిలిటీతో పాటు పోర్టికో కూలేందుకు కారణాల అనే్వషణ నిమిత్తం జెఎన్‌టియు చేపట్టిన అధ్యయనం ముగిసింది. ఈ మేరకు జెఎన్‌టియు నిపుణులు ఈ ఘటనపై మంగళవారం జిహెచ్‌ఎంసి అధికారులకు నివేదికను సమర్పించినట్లు తెలిసింది. ఫిల్మ్‌క్లబ్ పోర్టికో నిర్మాణానికి నాసిరకం సామాగ్రి వినియోగించటం, ఇంజనీరింగ్ నైపుణ్యత లోపించినందునే పోర్టికో కూలినట్లు జెఎన్‌టియు అధ్యయన నివేదికలో నిర్థారించినట్లు తెలిసింది.