హైదరాబాద్

బల్దియాపై భారమెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: జిహెచ్‌ఎంసి ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు ఒకవైపు ఎన్నికల వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. సుమారు రూ. 30 కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్న అధికారులు ఇదంతా జిహెచ్‌ఎంసి నిధుల నుంచే వెచ్చించనున్నారు. ఎన్నికలకు సంబంధించి నేటికీ నోటిఫికేషన్ జారీ కాకపోయినా, ఇవిఎంలను సమకూర్చుకోవటం, ఇప్పటికే ఎన్నికల విధి నిర్వహణకు నియమితులైన రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది, ఓటు వేసేందుకు వచ్చే పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వౌలిక వసతుల ఏర్పాటు మొదలుకుని, 27వేల మంది పోలీసులు, ఎన్నికల తీరు పర్యవేక్షించేందుకు వచ్చే పరిశీలకులు, అభ్యర్థుల వ్యయ పరిశీలకుల బస వంటి ఏర్పాట్లు చేపట్టేందుకు సుమారు మొత్తం రూ. 30 కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం ఎన్నికల విధులు నిర్వర్తించే వివిధ క్యాటగిరిల అధికారులు, సిబ్బందికి ఒక రోజు వేతనాలు, టిఏ, డిఏల చెల్లింపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. అంతేగాక, దీనికి తోడు రెండు రోజుల ముందు నుంచే పోలింగ్ కేంద్రాల వద్ధ , పరిశీలకులకు, వ్యయ పరిశీలకుల బందోబస్తు నిమిత్తం వచ్చే పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు త్వరలో జరగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక అభ్యర్థుల ప్రచారం తీరు, కార్యకలాపాలు వంటివి ఎప్పటికపుడు వీడియో రికార్డింగ్ చేసేందుకు వెయ్యి వీడియో కెమెరాలను సమకూర్చుకుంటున్నారు. వీటిని అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీనికి తోడు ప్రతి డివిజన్‌కు ఫైయింగ్ స్క్వాడ్, స్టాటస్టిక్ సర్వేలెన్స్ బృందాలు, 2వేల మంది సూక్ష్మ పరిశీలకులను కూడా రంగంలోకి దింపనున్నారు. వీరు గ్రేటర్‌లోని 150 డివిజన్లలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించే పనిలో ఉన్నారు.
ఇలావుండగా, సొంతిల్లు లేని పేదల కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్ ఇళ్ల యూనిట్ ధరను పెంచుతున్నట్లు సర్కారు తీసుకున్న నిర్ణయం మహానగర పాలక సంస్థ బడ్జెట్‌కు భారంగా మారనుంది. ఈ డబుల్ బెడ్ రూం స్కీం కింద ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సికిందరాబాద్ ఐడిహెచ్‌కాలనీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ స్కీం కింద నిర్మించే ఒక్కో ఇంటికి ఇప్పటి వరకు రూ. 5.30లక్షలుండగా, రోజరోజుకీ భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోవటంతో ప్రభుత్వం యూనిట్ ధరను రూ. 7లక్షలకు పెంచింది. ఇప్పటికే ఖైరతాబాద్ ఇందిరానగర్‌తో పాటు మరో పది ప్రాంతాల్లో ఈ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మొత్తం నిర్మాణ వ్యయాన్ని జిహెచ్‌ఎంసియే భరించాల్సి ఉంది. పెంచిన యూనిట్ ధరతో జిహెచ్‌ఎంసిపై రూ. 148 కోట్లు అదనపు భారం పడే అవకాశముంది. కానీ కొద్ది రోజుల క్రితం తొమ్మిది ప్రాంతాల్లో ఈ ఇళ్ల నిర్మాణానికి రూ. 151 కోట్ల పనులకు జిహెచ్‌ఎంసి అధికారులు టెండర్లను చేపట్టారు. ఈ అంచనా వ్యయం ఒక్కో యూనిట్ రూ. 5లక్షల 30వేల లెక్కనే రూపొందించినవి. కానీ ఇపుడు ఒక్కో ఇంటిపై రూ.1.70లక్షలు బల్దియాపై అదనపు ఆర్థిక భారం పడనుంది.