హైదరాబాద్

నేడు ఇందిరాపార్కు వద్ద టిడిపి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పార్టీ అని మాజీమంత్రి, టిడిపి నగర ఇన్‌చార్జ్ ఇ.పెద్దిరెడ్డి, టిడిపి సెంట్రల్ కమిటీ ప్రధానకార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నగర టిడిపి కార్యాలయంలో ఖైరతాబాద్ నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మంత్రులకు అధికారులకు మధ్య సయోధ్యలేకుండా పోయిందని, మంత్రులు ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదని దీంతో పరిపాలన సాగక పూర్తిగా కుంటుపడిపోయిందని అన్నారు. నగరంలో మున్సిపల్ శాఖమంత్రి కేటిఆర్ తరచూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే అధికారులకు, పాలకులకు మధ్య సమన్వయం ఏ మేరకు ఉందో అవగతమవుతుందన్నారు. ఇప్పటివరకు నగరంలో ఐడిఎ కాలనీలో తప్ప ఎక్కడా ఒక్క రెండు పడకల గదుల ఇంటిని నిర్మించిన పాపానపోలేదని వాపోయారు. కేవలం హామీలతోనే సరిపెడుతూ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ చేతకావడం లేదని ఆరోపించారు. నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయిందని, గుంతల మయంగా మారిన రోడ్లతో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని, విశ్వనగరం చేస్తామని నగరాన్ని పూర్తిగా రోగాల మయం చేస్తున్నారన్నారు. అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు మంచాన పడుతున్నారని దీంతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయని అన్నారు. మల్లన్నసాగర్ జీఓ వరకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన 23 జిఓలను కోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. నియంత పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జిహెచ్‌ఎంసి కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించనున్నామని నేతలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర సెక్రటరీ జనరల్ ఎం.ఎన్.శ్రీనివాస్, మేకల సారంగపాణి, బి.ఎన్.రెడ్డి, లంకెల దీపక్‌రెడ్డి, నల్లెల కిశోర్‌తోపాటు పలువురు సీనియర్ టిడిపి నేతలు పాలుపంచుకున్నారు.