హైదరాబాద్

నేడు నగరానికి ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్రమోదీ మొట్టమొదటి సారిగా ఆదివారం నగరానికి రానున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించినానంతరం నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగే బిజెపి బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు కమలనాథులు నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎల్బీస్టేడియంకు ప్రధాని వచ్చే రూట్‌లో ఆయనకు స్వాగతం చెబుతూ భారీగా ఫ్లెక్సీలు, ఆర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు సాయంత్రం అయిదు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు నాలుగైదు రోజుల నుంచి కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు జనసమీకరణ బాధ్యతలను అప్పగించారు. కేవలం జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి కమిటీ ప్రతినిధులు ఈ సమావేశానికి హజరయ్యేందుకు వీలుగా వారికి కమలనాధులు ప్రత్యేక ఆహ్వానం పంపింది. మోదీ మొట్టమొదటి సారిగా నగరానికి విచ్చేస్తున్నందున పార్టీలతో సంబంధం లేకుండా యువత కూడా పెద్ద సంఖ్యలో ఆయన ప్రసంగాన్ని వినేందుకు తరలిరానుంది. అంతేగాక, జనసమీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచే గాక, తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది జనాన్ని సమీకరించేందుకు కమలనాథులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు స్టేడియంలో ఏర్పాట్లను తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఇతర నేతలు పరిశీలించారు. అంతేగాక, పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచే ఎల్బీ స్టేడియం చుట్టూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. రాత్రి నుంచే స్టేడియంలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబీనీపార్కుల్లోకి సందర్శకులను అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. అలాగే ఎల్బీ స్టేడియం బహిరంగ సభకు వచ్చే వాహనాలను నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో పార్కింగ్ చేసుకోవాలని ఇప్పటికే పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.

మోదీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన
కలెక్టర్ రాహుల్ బొజ్జా
హైదరాబాద్, ఆగస్టు 6: నగరంలోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహా సమ్మేళన కార్యక్రమానికి ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు. మోదీ సభకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ఆర్‌అండ్‌బి అధికారులతో కలిసి సమీక్షించారు. వేదిక, బారికేడ్లు వంటి ఏర్పాట్లు ఈ రోజు రాత్రికల్లా పూర్తి కావాలని సూచించారు. స్టేడియమంతా తిరిగి కౌంటర్లు, లైటింగ్, గ్యాలరీ, సౌండ్ సిస్టమ్, ఎల్‌ఈడి స్క్రీన్లను పరిశీలించారు. దేశ ప్రధాని పాల్గొంటున్న సమావేశం కావడంతో ప్రతి అధికారి తాను చేయాల్సిన పనులు అంకింత భావంతో పూర్తి చేయాలని అన్నారు. ప్రధాన మంత్రి రాకను పురస్కరించుకొని దేశ రాజధాని నుండి వచ్చే పోలీసు అధికారులతో, రాష్ట్ర పోలీసులు పూర్తి సమన్వయంతో వ్యవహరించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ లింగారెడ్డి అధికారులు పాల్గొన్నారు.