హైదరాబాద్

తొలి దశగా 800 బస్ షెల్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: ఒకవైపు మెట్రోరైలు పనులు..మరోవైపు రోడ్డు విస్తరణల కారణంగా బస్ షెల్టర్లు కనుమరుగు కావటంతో ప్రయాణికులెదుర్కొంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. నగరంలో బస్ షెల్టర్లు, స్వచ్ఛ హైదరాబాద్, ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నెంబర్లు వంటి అంశాలపై మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు మంగళవారం సచివాలయంలో జిహెచ్‌ఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో ఆర్టీసి బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం 2008లో అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1800 బస్ షెల్టర్లున్నట్లు అధికారులు వివరించారు. జిహెచ్‌ఎంసి, ఆడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)తో కలిసి చేస్తున్న ప్రాజెక్టుల్లో భాగంగా మొత్తం 38 కారిడార్లలో ప్రాథమిక సర్వే నిర్వహించినట్లు మంత్రికి వివరించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం 2300 బస్ షెల్టర్లను గుర్తించినట్లు తెలిపారు. అయితే నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న జనాభా, రద్ధీని దృష్టిలో పెట్టుకుని, పూర్తి స్థాయిలో వౌలిక వసతులతో కూడిన దాదాపు 800 కొత్త బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. అంతేగాక, అధికారులు ఇదివరకే క్షేత్ర స్థాయిలో పలు కారిడార్లలో సర్వే నిర్వహించినా, మరో సారి సర్వే చేయాలని ఆదేశించారు. అయితే కొత్త బస్ షెల్టర్ల నమూనాలను తయారు చేసే బాధ్యత ఆస్కీకే అప్పగించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అయితే నాలుగు రకాలుగా డిజైనింగ్‌లు చేసే ఆస్కీ ప్రతి బస్ షెల్టర్‌లో ప్రయాణికులకు మెరుగైన వౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని కూడా మంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు. బస్ షెల్టర్ల పరంగా మొత్తం నగరాన్ని మూడు, నాలుగు జోన్లుగా విభజించాలన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పారిశుద్ద్యంపై ప్రత్యేక చర్చించారు. నగరంలో ఉన్న టాయిలెట్ల పైన ఇప్పటికే ఆస్కీ సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ టాయిలెట్లలో ప్రజలకు అందుబాటులో ఉన్నవి, ఉపయోగంలో లేని వాటి వివరాలు సేకరించినట్లు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నియంత్రణలోల భాగంగా ఎక్కువగా చెత్తను రోజువారీగా ఉత్పత్తి చేస్తున్న వారి నుంచి నేరుగా చెత్తను సేకరించేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. డిజిటల్ డోర్ నెంబర్ల ర్పాటును సమీక్షిస్తూ ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆస్కీ ప్రతినిధులు పాల్గొన్నారు.