హైదరాబాద్

కష్టకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: మహానగరాన్ని గ్లోబల్ సిటీగా, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరిచేందుకు సర్కారు రూపకల్పన చేసిన ప్రతిపాదనలు ఫలించటంలో జిహెచ్‌ఎంసి కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనేలా ఉంది. ప్రస్తుతమున్న ఆర్థిక వనరులు, మున్ముందు భరించాల్సిన ఆర్థిక భారాన్ని బేరీజు వేస్తే భవిష్యత్తులో జిహెచ్‌ఎంసికి ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటి వరకు ప్రతి ఏటా రూ. వేల కోట్లతో బడ్జెట్‌ను రూపకల్పన చేసుకునే జిహెచ్‌ఎంసి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేటాయింపుల్లో కేవలం యాభై శాతం పనులు కూడా చేపట్టిన దాఖలాల్లేవు. ఈ క్రమంలో గ్లోబల్ సిటీ ప్రతిపాదనల్లో భాగంగా స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)కి సంబంధించి తొలి దశగా సుమారు రూ. 2631 కోట్ల ప్రతిపాదనల్లో దాదాపు రూ. 1100 కోట్ల పనులకు సర్కారు పరిపాలనపరమైన అనుమతులు జారీ చేయటంతో అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా సుమారు రూ. 3555 కోట్ల బడ్జెట్‌ను రూపొందించుకున్న అందులో పనులకు జరిపిన కేటాయింపుల్లో నేటికి నలభైశాతం కూడా వెచ్చించలేకపోయారు. ఈ క్రమంలో ఒకేసారి రూ. 2వేల 631 కోట్ల పనులను చేపట్టి, పనులు పూర్తయిన కొద్ది ఎజెన్సీలకు బిల్లులు చెల్లించటం, రోజువారీ నిర్వహణ పరమైన బాధ్యతలను మోయటం, సర్కారు కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి ఏటా ఆర్టీసికి రూ. 200 కోట్లు చెల్లించేందుకు అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్‌లైసెన్సులు ఇతరత్ర మార్గాల ద్వారా జిహెచ్‌ఎంసికి ఏటా రూ. 2500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో రెగ్యులర్ మెయింటనెన్స్ రూ. 1500 కోట్లు వెచ్చించగా, వెయ్యి కోట్లు మిగులుతున్నాయి.
తొలి దశగా రూ. 2631 కోట్లతో ఎస్‌ఆర్‌డిపి పనులు చేపట్టనున్న బల్దియా బిల్లులు చెల్లించటంతో పాటు దీర్ఘకాలంగా సుమారు రూ. 21వేల కోట్ల గ్లోబల్ సిటీ పనులను చేపట్టాల్సి ఉంది. దీంతో ప్రతి ఏటా కార్పొరేషన్‌పై పడే ఆర్థిక భారం వందల కోట్లలోనే ఉంటుంది. ఇపుడు దీనికి తోడు నగరంలో తొలి దశగా నిర్మించతలపెట్టిన 25వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ వ్యయంలో ఎక్కువ శాతం బల్దియానే భరించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ప్రభావం కొన్ని సంవత్సరాల వరకు ఉండే అవకాశమున్నందున, ప్రస్తుతం పుష్కలమైన నిధులు, మిగులు బడ్జెట్‌తో ఉన్న గ్రేటర్‌లో మున్ముందు లోటు బడ్జెట్‌కు వెళ్లే పరిస్థితి నెలకొంది. సర్కారు నుంచి గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అంతంతమాత్రంగానే మారటంతో మొత్తం ఎస్‌ఆర్‌డిపి పనులు రూ. 21వేల కోట్లు బల్దియానే భరించాల్సి ఉంది. ఈ క్రమంలో జిహెచ్‌ఎంసి రెగ్యులర్ మెయింటనెన్స్‌ను చూసుకుంటూనే, ఏటా వందల కోట్లను ఎస్‌ఆర్‌డిపి చెల్లించాల్సి ఉంది.
ఈ క్రమంలో కార్పొరేషన్ అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడినా, ఆస్తిపన్ను పెంచకుండానే ఆదాయం పెంచుకునేందుకు అధికారులను మార్గాలను అనే్వషిస్తున్నారు. ఈ క్రమంలో బల్దియాకు చెందిన ఇండోర్ స్టేడియంలు, ప్లే గ్రౌండ్లను అద్దెకు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే!
అయినా అధికారుల అంచనాల మేరకు ఆదాయం సమకూరదు. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలా? అన్న అంశంపై త్వరలోనే మున్సిపల్ మంత్రి కెటిఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.