హైదరాబాద్

60 రోజుల యాక్షన్ ప్లాన్‌పై జలమండలి ఎండి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: జలమండలి పరంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, విడిఎస్, అక్రమ నీటి కనెక్షన్ల క్రమబద్దీకరణ వంటి అంశాలపై సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏసి గార్డ్స్‌లోని సిడిఎంఎ కార్యాలయంలో శుక్రవారం జరగిన సమీక్షలో ఎండి అక్రమ నీటి కనెక్షన్ల క్రమబద్దీకరణ, మీటర్లు బిగించుకోవాలని సూచిస్తూ జారీ చేసిన నోటీసులు తదితర అంశాలపై ఎండి ఆరా తీశారు. వివిధ విభాగాల డైరెక్టర్లు జి.రామేశ్వర్‌రావు, డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, టి.రవింధర్‌రెడ్డి, శ్రీ్ధర్‌బాబు, ఎం.ఏల్లస్వామి, ఆజ్మీరాకృష్ణతో పాటు ఇడి ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.
నేడు డయల్, మీట్ యువర్ జలమండలి ఎండి కార్యక్రమం
జలమండలి పరంగా వినియోగదారులకు మేరుగైన సేవలు అందించేందుకు ప్రతి నెల మూడవ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు మీట్, డయల్ యువర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈనెల 20వ తేదీన ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటల నుండి మీట్ యువర్ ఎండి కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు డయల్ యువర్ ఎండి కార్యక్రమం కోనసాగుతుంది. కార్యక్రమంలో జలమండలి ఎండి ఎం.దానకిశోర్ పాల్గొని వినియోగదారులు ఎదుర్కొంటున్న వివిధ సమాస్యలను పరిష్కారిస్తారు. డయల్ యువర్ ఎండి కార్యక్రమంలో పాల్గొనే వినియోగదారులు ముందుగా నీటి కనెక్షన్‌కు సంబంధించిన క్యాన్ నెంబర్‌ను తెలిపి ఫోన్ నెంబర్లు 040-23442881, 23442882, 23442883లో సంప్రదించాలి.