హైదరాబాద్

‘సింధు’హాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఒలింపిక్ క్రీడల్లో అరుదైన రికార్డులు సృష్టించి, తెలుగువారంటే తక్కువేమీ కాదని చాటిన తెలుగు తేజం సింధుకు మహానగరం సోమవారం అడుగడుగునా ఘనస్వాగతం పలికింది. కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కలిసి ఆమె శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, క్రీడాకారులు, పలువురు ఉన్నతాధికారులు వారికి చిరుమందహాసంతో స్వాగతం పలికారు. ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో తిలకించిన రియో క్రీడల్లో తెలంగాణ సత్తాను చాటి తిరిగి స్వస్థలానికి చేరుకున్న సింధును విద్యార్థులు, క్రీడాకారులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు మొదలుకుని కళాకారులు సైతం అడుగడుగునా అభినందిస్తూ ఆదరించారు. అభిమానుల ఆనందాన్ని, తనను చూసేందుకు వేల సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులను చూసి తట్టుకోలేని సింధూ తన డబుల్ డక్కర్ కన్వాయిన్‌లో మెల్లిగా కదులుతూ, సింధు అక్కా..వెల్‌కం అంటూ ప్రతి విద్యార్థిని ప్రేమగా ఇచ్చిన పూలను స్వీకరిస్తూ,వారి స్వాగతాన్ని స్వీకరిస్తూ, చిరుదరహాసంతో ముందుకు కదిలారు. అతి చిన్న వయస్సులోనే ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా షటిల్ బాడ్మింటన్‌లో అద్భుతమైన ప్రతిభను కనబర్చి, దేశానికే వనె్న తెచ్చిన సింధు తమకు స్పూర్తిదాయకమని కొందరు విద్యార్థినిలు వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలీ స్టేడియం వరకు గంటల తరబడి కొనసాగిన విజయోత్సవ ర్యాలీకి క్రీడాభిమానులు, విద్యార్థులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. శంషాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహిదీపట్నం ప్రాంతాల మీదుగా ర్యాలీ స్టేడియంకు చేరుకుంది. ఆ తర్వాత గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన సన్మాన సభకు సింధు వచ్చేటపుడు కళాకారులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి నింపేందుకు ఆలపించిన గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.