హైదరాబాద్

తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీ, మిత్రపక్షమైన బిజెపి సంయుక్తంగా ఈ నెల 12న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. నిజాం కళాశాల మైదానానికి పోలీసులు అనుమతించడంతో ఇరు పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. నిజాం కళాశాల ఆవరణలో రాజకీయ పార్టీల సభలు నిర్వహించేందుకు అనుమతించమని పోలీసులు తేల్చి చెప్పడంతో బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టేందుకే నిజాం కళాశాల మైదానానికి అనుమతించడం లేదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఆదివారం ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డితో, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి, ఇంత కాలం ఆ మైదానంలో బహిరంగ సభలు జరగలేదా? అని ప్రశ్నించారు. దీనిపై రెండు పార్టీలూ కోర్టుకు వెళ్ళేందుకు సిద్ధమయ్యాయి. ఇలాఉండగా పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతిస్తున్నామని చెప్పారు.
ఈ బహిరంగ సభకు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. టిడిపి-బిజెపి నాయకులు సీట్ల సర్దుబాటు కోసం శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. అయితే ఇరు పార్టీలకు ఆశావాహుల నుంచి ఇంకా దరఖాస్తులు వస్తున్నందున మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

సైబార్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

చేవెళ్ల, జనవరి 10: గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంక్ వాళ్లమని ఫోన్ చేసి ఎటిఎం పిన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగితే చెప్పి మోసపోవద్దని చేవెళ్ల డిఎస్పీ రంగారెడ్డి తెలిపారు. ఆదివారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ, ఆన్‌లైన్ సైబార్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్లు, ఏటిఎం కార్డు, డిబిట్‌కార్డు, వీసాకార్డుల పిన్ నెంబర్లు బ్యాంక్ వారు అడిగినా చెప్పవద్దని ప్రజలకు సూచించారు. చదువురాని వారితో పాటు చదువుకున్న వారు కూడ ఈలాంటి ఆన్ లైన్ ఫోన్‌కాల్స్ వలన మోసపోయారని వివరించారు. ఏటిఎం పిన్ నెంబర్ ఎక్కడపడితే అక్కడ చెప్పడం, రాయడం చేయకూడదన్నారు. సబ్‌డివిజన్ పరిధిలోని కులకచర్ల మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన సిహెచ్ సత్యము కూలిపని చేసుకోని బ్యాంక్‌లో డబ్బులు జమచేసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని ఏటిఎం పిన్ నెంబర్ చెప్పడంతో అతని ఖాతానుండి 49వేలు డ్రా చేసుకున్నారని వివరించారు. బ్యాంకు అధికారులు ఏటిఎంల వద్ద సెక్యూరిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ అధికారులు కూడా ఎటిఎంను ఎలా వాడాలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అదేవింగా ఏటిఎం సెంటర్ల కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల సిఐ ఉపేందర్, ఎస్సైలు రాజశేఖర్, విజయభాస్కర్ ఉన్నారు.