హైదరాబాద్

కొత్త తరహాలో నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: మహానగరంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ సారి వినాయక నిమజ్జనం సరికొత్త తరహాలో జరగనుంది.
నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడ్ని నిమజ్జన రోజునే ఉదయానే్న నిమజ్జనం చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. కానీ ఈ సారి హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్‌ఎంసి తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్లలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం జరిగేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కొలనుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని ఇప్పటికే బల్దియా విస్త్రృతంగా ప్రచారం కూడా చేస్తోంది. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు భాగ్యనగర గణేష్ ఉత్సవాల ప్రతినిధులతో ఓ దఫా వివిధ ప్రాంతాల్లో పర్యటించినా, రెండు, మూడురోజుల్లో అన్ని విభాగాల అధికారులు మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ప్రత్యేక కొలనుల్లో మాత్రమే నిమజ్జనం నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చర్లపల్లి ప్రాంతాల్లో మొట్టమొదటి కొలను పనులను ప్రారంభించగా, ప్రస్తుతం గ్రేటర్‌లోని పది కొలనుల్లో ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 15వ తేదీ నిమజ్జనం రోజు కల్లా అన్ని కొలనుల పనులు పూర్తి కావాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి.. చెరువుల విభాగం ఇంజనీర్లను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ చెరువును కాలుష్యత రహిత చెరువుగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు హైకోర్టుకు జిహెచ్‌ఎంసి స్పష్టం చేసింది. నగరంలో రూ. 6.95కోట్ల వ్యయంతో పది చెరువుల్లో నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా శుభ్రమైన నీటిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఈ ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనం చేసిన తర్వాత వ్యర్థాలను వెంటవెంటనే బయటకు తీసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో నిమజ్జనం చేయాలన్న బెంగుళూరు విధానాన్ని నగరంలో మొదటిసారిగా అమలు చేస్తున్నందున ఈ ఏడాది 15 అడుగుల ఎత్తు కల్గిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న బల్దియా వచ్చే సంవత్సరం 20 అడుగుల ఎత్తు కల్గిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఈ ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని, సకాలంలో పనులు పూర్తి చేసేందుకు వీలుగా కాంట్రాక్టర్లు అవసరమైతే అదనంగా కార్మికులను, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకోవాలని ఇప్పటికే కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.