హైదరాబాద్

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం లబ్ధిదారులను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: నగరంలో నిలువనీడ లేని పేదల కోసం గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లకు అర్హులైన లబ్దిదారులను త్వరితగతిన గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆర్టీవోలు, గృహానిర్మాణ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ఛాంబర్‌లో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అదే విధంగా లబ్దిదారులు పది శాతం తనవంతు వాటా తప్పకుండా చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై సంబంధిత తహసిల్దార్లు గృహా సముదాయాల రెసిడెన్షియల్ అసొసియేషన్ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించి లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాను త్వరితగతిన చెల్లించే విధంగా వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. తనవంతు వాటాను చెల్లించని లబ్దిదారులను జాబితా నుంచి తొలగించటం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అక్రమంగా ఇళ్లను స్వాధీనం చేసుకున్న వారిని వెంటనే తొలగించాలని ఆర్టీవోలను ఆదేశించారు. జిల్లాలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం స్కీం కింద పదివేల 114 గృహాలు కేటాయించాల్సి ఉండగా, ఇప్పటికే 9573 మంది లబ్దిదారులను గుర్తించటం జరిగిందని వివరించారు. మిగితా 541 మంది లబ్దిదారులను కూడా త్వరగా గుర్తించాలని ఆయన ఆర్టీవోలను ఆదేశించారు. ఇందులో పదిశాతం లబ్దిదారుల వాటా, ఇరవై శాతం రుణం చెల్లించని వారికి ఎంటనే నోటీసులు జారీ చేయాలని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్డీవోలు రఘురాం శర్మ, నిఖిల, హౌజింగ్ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
టెండర్ల స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల స్కీం ఎట్టకేలకు గ్రేటర్‌లో టెండర్ల స్థాయికి చేరింది. మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలన్న టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం తొలి దశగా 18 ప్రాంతాల్లో 5వేల 50 ఇళ్లను నిర్మించేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం జిహెచ్‌ఎంసి అధికారులు 15 ప్రాంతాల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. జి ప్లస్ 3 భవనాల్లో నిర్మించే ఒక్కో యూనిట్‌కు రూ. 7లక్షలు, అంతకన్నా పై అంతస్తుల్లో నిర్మించే ఒక్కో యూనిట్‌కు రూ. 7.90 లక్షల రేట్‌ను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇటీవలే అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే!