హైదరాబాద్

10వ తేదీ కల్లా నిమజ్జనం కొలనుల నిర్మాణం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయటంతో చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ఉండేందుకు ఈ ఏటా గ్రేటర్ కొత్తగా నిర్మిస్తున్న నిమజ్జన కొలనులు నిర్ణీత గడువు కన్నా కాస్త ముందుగానే సిద్దం చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిమజ్జనం కొలనుల నిర్మాణ పనులపై ఇంజనీర్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ. 6 కోట్ల 35 లక్షల వ్యయంతో నగరంలోని పది ప్రాంతాల్లో పది ప్రత్యేక కొలనులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటిని నిర్మాణం వచ్చే నెల 10వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఆయన ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ కల్లా చెర్లపల్లి, రాయదుర్గంలోని మల్క చెరువుల వద్ద నిర్మిస్తున్న కొలనుల నిర్మాణం పూర్తవుతుందని, అదే విధంగా కాప్రాలోని ఊరచెరువు, కూకట్‌పల్లిలోని పర్కి చెరువు, ట్యాంక్‌బండ్, జీడిమెట్లలోని వెనె్నల చెరువు, శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల చెరువు, సరూర్‌నగర్ పెద్ద చెరువులలో నిర్మిస్తున్న కొలనుల నిర్మాణం సెప్టెంబర్ పదవ తేదీలోపు పూర్తి చేస్తామని ఇంజనీర్లు మేయర్‌కు వివరించారు. కూకట్‌పల్లిలోని రంగదాముని కుంట కొలను నిర్మాణం సెప్టెంబర్ 14వ తేదీన పూర్తి కాగలదని ఆయన తెలిపారు. అవసరమైతే అదనపు సిబ్బంది, యంత్రాలను కూడా సమకూర్చుకుని నిమజ్జనం తేదీ కన్నా ముందే పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు. ఈ పనుల నిర్మాణానికి గాను పగటి వేళలో రెడిమిక్స్ సిమెంట్ వాహనాలను అనుమతించేందుకు పోలీసు అధికారులతో మాట్లాడి తగు ఆదేశాలు జారీచేయటం జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. నగరంలో గణేష్ విగ్రహాలను ప్రత్యేక కొలనులను నిర్మిస్తున్నట్లు హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశామని, ఈ నేపథ్యంలో వీటి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరముందని ఆయన ఇంజనీర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని కొలనులు వచ్చే నెల 10వ తేదీ కల్లా సిద్దం కావల్సిందేనని మేయర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నిర్మాణం వద్ద సంబంధిత ఇంజనీర్లు విధిగా ఉండాలని, నాణ్యత ప్రమాణాల్లో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తేలేదని మేయర్ సూచించారు. ఈ సమావేశంలో గ్రేటర్ చెరువుల విభాగం ఎస్‌ఇ శేఖర్‌రెడ్డి ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.