హైదరాబాద్

సమన్వయముంటే.. సమస్యే ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: అసలే వర్షాకాలం..ఆపై వినాయక చవితి, బక్రీద్ పండుగల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో పండుగలు ప్రశాంతంగా జరిగేలా చొరవ చూపాలని సమన్వయ కమిటీలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. నగరంలో వివిధ విభాగాలు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వేగవంతంగా జరిగేందుకు వీలుగా శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ప్రతి నెలా జరిగే ఈ సమావేశం శనివారం కంటోనె్మంట్ సిఇవో కార్యాలయంలో జరిగింది. సమావేశంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా నగర పోలీసులు, జిహెచ్‌ఎంసితో పాటు ఇతర అన్ని విభాగాలకు ఓ సవాలుగా మారిందన్నారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినందున నగరవాసులు ఇబ్బందులను తగ్గించటంలో సఫలీకృతులయ్యామని అన్నారు. ఈ నెల 5వ తేదీ వినాయక చవితి, 12వ తేదీ బక్రీద్ పండుగలు జరుగుతున్నందున వీటిని ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రతి శాఖలోని అధికారులు, సిబ్బంది మరింత చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాల్సి ఉందన్నారు. భోలక్‌పూర్‌లో కాలుష్యానికి కారకమై, ప్రమాదకరంగా మారిన లెదర్, ప్లాస్టిక్ పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, పరిశ్రమల శాఖలు కలిసి పునరుద్ధరణకు పైప్‌లైన్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని సమావేశం తీర్మానించింది. శ్రీనగర్‌కాలనీలో పైప్‌లైన్, కేబుల్ నిర్మాణ పనులు పూర్త అయినందున రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. అలాగే నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించేందుకు ప్రతిపాదించిన స్థలాలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ల నుంచి స్వీకరించేందుకు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. పాతబస్తీలోని పలు నాలాల విస్తరణకుగాను నాలాలను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న వారిని తొలగించి, వారికి ప్రత్యామ్నాయ పునరావాసాన్ని కల్పించేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహాలను కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు భారతి హోళికేరి, రజత్ భార్గవితో పాటు పోలీసులు, జలమండలి, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పలు ప్రాంతాల్లో వెంటనే రోడ్లు
హైదరాబాద్ మెట్రో రైలు మార్గంలో రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికే ఈ మార్గంలో రోడ్ల పరిస్థితిపై కాల్ సెంటర్, ట్విటర్, యాప్ ద్వారా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఓల్డ్ ముంబై హైవే మార్గంలోని నారాయణమ్మ కాలేజీ నుంచి బయోడైవర్శిటీ జంక్షన్ వరకు గాను జలమండలి ద్వారా పైప్‌లైన్ నిరామ్ణ పనులు పూర్తి అయినందున రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసే వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. ఫతేనగర్ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున ఉ రెండు కిలోమీటర్ల రోడ్డును వెంటనే పునరుద్దరించాలని పోలీసులు కోరగా, ప్రస్తుతం ఈ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నామని, తర్వాత కొత్త రోడ్డును వేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. నాగోల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల నివారణ గాను రూ. 2 కోట్ల 59లక్షల వ్యయంతో రోడ్డు డివైడర్ల ఎత్తున పెంచటానికి అంచనాలు సిద్దం చేశామని తెలిపారు. మరో రూ. 11 కోట్ల వ్యయంతో చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధికి గాను ఏడు పనులకు పరిపాలన సంబంధిత అనుమతులు లభించాయని, వీటి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నగరంలో వీధి దీపాలకు విద్యుత్ మీటర్లను బిగించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యుత్ శాఖను కోరారు. అలాగే నగరంలోని జంక్షన్లు, పార్కులు, బస్టాపుల వద్ద వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయటానికి 200 చదరపు అడుగుల స్థలాన్న కేటాయించాలని జలమండలి అధికారులు కోరారు.
సికిందరాబాద్ కంటోనె్మంట్ పరిధిలో ప్రధానంగా ఏడు ప్రాంతాల్లో వర్షపునీటి నిల్వలు భారీగా ఏర్పడుతున్నాయని, వీటిని తొలగించడానికి సంబంధిత శాఖలు సహకరించాలని కంటోనె్మంట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సుజాత గుప్తా కోరారు. అదే విధంగా ప్యాట్నీ వద్ద నాలా నిర్మాణాన్ని అసంపూర్తిగా చేయటం వల్ల వర్షపు నీరు పూర్తిగా కంటోనె్మంట్‌లోకి వస్తున్నందున దీన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. తదుపరి సమావేశం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.