హైదరాబాద్

కశ్మీర్‌లో శాంతికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని ఐక్యత- ప్రేమ పునాదులపై పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఇంతవరకూ పాకిస్తాన్‌తో కేంద్ర ప్రభుత్వం స్నేహ హస్తాన్ని అందించడంతో పాటు పలుమార్లు అన్ని వర్గాలతో చర్చలు జరిపిందని గుర్తుచేశారు. జమ్మూకాశ్మీర్ అధ్యయన కేంద్రం హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులపై నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ హైస్కూల్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌ను దక్కించుకునేందుకు పాకిస్తాన్ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోందని, ఇందుకోసం అమాయకులను రెచ్చగొట్టి ఎందరో ప్రాణాలను బలిగొంటోందని ,మరికొందరిని తీవ్రవాదులను తయారుచేస్తోందని, గత కొంతకాలంగా కశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులకు ఇదే కారణమని అన్నారు.
వరదల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్‌ను సందర్శించారని, అపుడు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారని అన్నారు. దీంతో ప్రజలకు కూడా నమ్మకం కలిగిందని అన్నారు. అయితే ప్రస్తుతం పర్యాటకులు వెళ్లే పరిస్థితులు లేవని, దీనికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని అన్నారు. జమ్మూకాశ్మీర్ అధ్యయన కేంద్రం చైర్మన్ జవహర్ కౌల్ మాట్లాడుతూ శాంతి నెలకోల్పే ప్రయత్నంచేయాలని అన్నారు. ప్రొఫెసర్ రవీంద్రశాస్ర్తీ, భరత్‌భూషణ్ తదితరులు పాల్గొన్నారు.