హైదరాబాద్

నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: వినాయక నిమజ్జనానికి మహానగర పాలక సంస్థ ప్రతిపాదించిన ఏర్పాట్ల పనులను ముమ్మరం చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఇప్పటికే సఫిల్‌గూడ, కాప్రా చెరువుల్లో చేపట్టిన నిమజ్జన ప్రత్యేక కొలనుల నిర్మాణ పనులు, నిమజ్జనానికి కేంద్ర బింధువైన హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్‌ల చుట్టూ చేపట్టిన రోడ్డు మరమ్మతుల పనులను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పనులన్నీ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా నిమజ్జనం కోసం ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న కొలనులను ఈ నెల 10వ తేదీలోపు అందుబాటులోకి తేవాలని, అంతేగాక, ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే నిమజ్జనానికి కొలనుల వద్ధ సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. దీంతో పాటు నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లోనూ రోడ్ల మరమ్మతులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, యుద్ద ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో ఇటీవల కురిసిన వర్షానికి ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అలాగే భారీ వినాయకులు నిమజ్జనానికి వచ్చే రూట్లలో కూడా ఎప్పటికపుడు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలు మట్టి విగ్రహాలను పూజించి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. రసాయనాలతో కూడిన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లతో తయారు చేసిన విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయటం వల్ల చెరువులు కాలుష్యానికి నిలయంగా మారుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించి, మట్టి విగ్రహాలను పూజించే దిశగా ఆసక్తి చూపాలని కమిషనర్ సూచించారు. ఈ తనిఖీల్లో ఆయనతో పాటు నార్త్‌జోన్ జోనల్ కమిషనర్ శంకరయ్య, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కిషన్ ఇతర అధికారులున్నారు.