హైదరాబాద్

సిటీలో ఓటర్లు 74లక్షల పై మాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: మహానగర పాలక సంస్థ పరిధిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా అధికారులు చేపట్టిన ఓటరు జాబితా సవరణ, అంతకన్నా ముందు చేపట్టిన ఎలక్షన్ ఐడి కార్డు, ఆధార్ కార్డుల అనుసంధానం వంటి వివిధ రకాల ప్రక్రియల ద్వారా అధికారులు నగరంలోని తెలంగాణేతర ప్రాంతలకు చెందిన ప్రజల ఓటర్లను తొలగించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే! దీనిపై వివిధ విపక్షాలకు చెందిన నేతలు జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించటంతో ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం నగరానికి విచ్చేసి పలు ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆరా తీసి, తొలగించిన ఓట్ల విషయాన్ని మరోసారి పునఃపరిశీలించాలని జారీ చేసిన ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు మరోసారి ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే!
చివరకు ఈ నెల 8వ తేదీ జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే రోజు వరకు కూడా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశమివ్వటంతో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. మహానగర పాలక సంస్థలో కొత్తగా 3లక్షల 87వేల 530 మంది ఓటర్లు నమోదయ్యారని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం 70 లక్షల 67వేల 934 మంది ఉండగా, అదనంగా 3లక్షల 87వేల 530 మంది ఓటర్లు నమోదు కావటంతో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 36వేల 247కు చేరుకుందని ఆయన వివరించారు. ఇందులో పురుషుల ఓట్ల సంఖ్య 39లక్షల 73వేల, 374 మంది కాగా, మహిళల ఓట్లు 34లక్షల 61వేల 919కి చేరింది. ఇతరుల ఓట్ల సంఖ్య 554 ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. ఓటింగ్ శాతం పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు గాను ఓటర్లు తమ పోలింగ్ బూత్ తదితర వివరాలు తెల్సుకునేందుకు వీలుగా ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించామని ఆయన వివరించారు.