హైదరాబాద్

విజిటింగ్ వీసాపై దుబాయి వెళుతున్న మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,శంషాబాద్, నవంబర్ 28: ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు చెందిన 11మంది మహిళలు విజిటింగ్ వీసాపై దుబాయికి వెళుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని ఆర్‌జిఎఫ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం..కడప జిల్లా రైల్వేకోడూరు, చిట్యాల, తుమ్మచెట్లపల్లికి చెందిన ఎనిమిది మంది మహిళలతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు, బెంగుళూరుకు చెందిన ఒక మహిళ దుబాయి మీదుగా కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు.
ఉపాధి కోసం వెళ్తున్నామని వీరు తెలుపగా వీరి వీసాలు మాత్రం దుబాయి వరకు మాత్రమే ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు. ఉపాధి కోసం వెళ్తున్న వీరిలో ఎనిమిది మంది మహిళల నుంచి ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి రూ. 50వేల నుంచి ఒక లక్ష వరకు వసూలు చేసి మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని ఏడుగురు ఏజెంట్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు. తమను ఉపాధి కోసం కువైట్ పంపుతున్నట్టు మోసగించిన ఏజెంట్లపై చర్య తీసుకోవాలని మహిళలు పోలీసులను వేడుకొన్నారు.