హైదరాబాద్

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై టిడిపి ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12:ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ వెనుకాడబోదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నగర్ ఇన్‌చార్జ్ ఇ.పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగర టిడిపి కార్యాలయంలో కొత్తగా నియమితులైన కన్వీనర్ ఎంఎన్ శ్రీనివాస్, కో-కన్వీనర్ మేకల సారంగపాణితోపాటు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ గడిచిన రెండున్నర సంవత్సరాలుగా తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను ఒక్కటి కూడ నెరవేర్చకపోగా అన్ని నెరవేర్చామని ప్రజలను బుకాయించే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. రైతులకు లక్షరూపాయల రుణమాఫీని చేస్తామని చెప్పి కనీసం వడ్డీని సైతం మాఫీ చేయలేని దగాకోరు సర్కార్‌తో రైతులకు అసలు బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదని అన్నారు. రబీలో దాదాపు 17వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కనీసం 4వేల మంది కూడ అందుకు అర్హులుకాకపోవడం దారుణమని చెప్పారు. దీంతో ఆత్మహత్యలు పెరిగిపోయాయని, గిట్టుబాటుధరను కల్పించలేక దళారులకు రాచబాట వేసినట్లుగా తెరాస ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగుభూమిని ఇస్తామన్న సర్కార్ ఎంతమందికి ఇచ్చారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కెజి నుంచి పిజి వరకు ఉచిత నిర్భంద విద్యను అందిస్తామని, ఇంటికో ఉద్యోగం చొప్పున ఇస్తామని, నగరంలో రెండు లక్షల రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని అమలు చేయలేదని పేర్కొన్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి.. చెత్తనగరంగా మారుస్తుందని, నగరంలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని, గ్రేటర్ ఎన్నికల ముందు ఇంటి పన్ను, నల్లాపన్నులు మాఫీ చేస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటి వరకు ఎంతమందికి మాఫీ చేశారని పెద్దిరెడ్డి అన్నారు. సకలజనుల సర్వేతో ఏదో మేలు జరుగుతుందని ఊహించిన ప్రజలకు షాక్ ఇస్తూ 50వేల ఆహారభద్రత కార్డులను తొలగించారని అన్నారు. నగరంలో గుంతల మయమైన రోడ్లు, చెత్తతో నిండిపోయిన వీధులతో అధ్వాన్న నగరంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతలు రోడ్డుపైకి వచ్చి నిలదీయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. అందరిని కలుపుకుని ఈ నెల 19, 20వ తేదీల్లో ఇందిరా పార్కు వద్ద మహాధర్నాను నిర్వహించనున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. జిల్లాలను ఇష్టానుసారంగా విభజిస్తే ప్రభుత్వం మరోసారి కోర్టు మొట్టికాయలు తినాల్సి వస్తుందని అన్నారు. కూన వెంకటేశ్‌గౌడ్, దీపక్‌రెడ్డి, వనంరమేశ్, భజరంగ్‌శర్మ, నల్లెల కిశోర్ పాల్గొన్నారు.