హైదరాబాద్

ముందుగానే గంగమ్మ ఒడిలోకి మహాగణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 14: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడు ముందుగానే గంగమ్మ ఒడిలోకి చేరిపోనున్నాడు. ప్రతీ ఏడు భారీ గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరిన మరుసటి రోజు ఉదయానికి గాని నిమజ్జనం పూర్తి అయ్యేది కాదు. దీంతో ఇటు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు నానాతంటాలు పడాల్సి వచ్చేంది. వీటికి తోడు అన్నట్టు మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యే వరకు ట్యాంక్‌బండ్‌పై ఇతర గణనాథుల నిమజ్జనానికి అంతరాయం ఏర్పడటం జరుగుతుండేది. ఈ ఇబ్బందులను తప్పించేందుకు పోలీస్‌శాఖ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీని కొద్దిగా ముందుగానే నిమజ్జనం చేసేలా ఒప్పించింది. దీంతో బుధవారం అర్ధరాత్రి వరకే భక్తుల దర్శనానికి అధికారులు అనుమతించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచే గణనాథుడితో పాటు ఇతర దేవతామూర్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించారు. బుధవారం ఉదయం సపోర్టింగ్ కోసం ఏర్పాటు చేసిన కర్రలను సైతం తొలగించారు. రాత్రి ఒంటిగంట నుంచి వెల్డింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి పనులకు అంతరాయం ఏర్పడింది. గొడుగులను పట్టి మరీ వెల్డింగ్ పనులను చేపట్టారు. ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా నుంచి ఎస్‌టిసి ట్రాన్స్‌పోర్టు వాహనంపై సెనే్షషన్, రాజ్‌దూత్ చౌరస్తా, సచివాలయం మీదుగా గణపతి ప్రయాణం కొనసాగనుంది. ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ నుంచి నిమజ్జనం పూర్తిచేయనున్నారు. గణపతి నిమజ్జనానికి రవిక్రేన్‌ను వినియోగిస్తున్నారు.
మారిన రధసారథి
ఖైరతాబాద్ మహాగణపతిని తరలించే వాహనానికి ఈ ఏడు రథసారథి మారారు. నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేష్ ట్రాలర్ డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు. 49 టన్నుల సామర్థ్యం, 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలిగిన ఈ వాహనానికి 26 టైర్లు ఉంటాయి. ఈ వాహనంపై 40 టన్నుల బరువు ఉన్న గణనాథుడ్ని తరలించనున్నారు.